జగన్ బెయిల్: 'బాబు ఎలా ఆపగలరు.. అందుకే ఢిల్లీకి'

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను ఎలా ఆపగలరో ఆ పార్టీ నాయకులు చెప్పాలని మండిపడ్డారు.

ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు లక్ష కోట్ల డబ్బులపై ఉన్న ప్రేమ కొడుకు పైన లేదన్నారు. ఆమె ఫిరాయింపుదారులను తన చుట్టు పెట్టుకున్నారని ఆరోపించారు. విజయమ్మ తమ పార్టీని, చంద్రబాబును విమర్శించడం మానుకోవాలని సూచించారు. అవినీతికి తమ పార్టీ పూర్తి వ్యతిరేకమన్నారు. గతంలో చంద్రబాబును పొగిడిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపి మునిగిపోయే నావ అన్న బిజెపి కిషన్ రెడ్డి పైనా మండిపడ్డారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును, టిడిపిని గత నెల రాష్ట్రానికి వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పొగిడారని, ఆ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి మర్చిపోయారా అని ప్రశ్నించారు. బిజెపియే మునిగిపోయే నావ అన్నారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిని చేయడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమన్నారు.

బెయిల్ బాబు అడ్డుకునేందుకే ఢిల్లీకి: భూమన

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆరోపించారు. న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తన బినామీల ద్వారా బాబు బెయిల్ రాకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+