ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడాలంటే - విద్యార్ధులు, పేరెంట్స్ కు అరుదైన ఛాన్స్..!!
ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నారా. విద్యార్ధులు..పేరెంట్స్ కు ఒక అరుదైన అవకాశం రానుంది. ఇందు కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే వారికి ఈ అవకాశం దక్కనుంది. అదే విధంగా వారి పేరెంట్స్ తో పాటుగా ఉపాధ్యాయులకు ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇందు కోసం రిజిస్టర్ చేసుకునే విధానం.. మార్గదర్శకాలను అధికారులు వెల్లడించారు.
ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడాలనుకునే వారి కోసం కీలక అప్డేట్. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోండి. వార్షిక పరీక్షల కంటే ముందు విద్యార్థుల్లో భయం, మానసిక ఒత్తిడి, ఆందోళన ఉండడం సహజమే. అయితే వీటిని అధిగమించేందుకు ప్రధాని మోదీ 3 ఏళ్ల నుంచి పరీక్షలకు ముందు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా (www.innovateindia.mygov.in) వెబ్సైట్లో పార్టిసిపేట్ అనే బటన్‌పై క్లిక్‌చేసి విద్యార్థి, టీచర్, తల్లిదండ్రుల్లో ఎవరైతో దరఖాస్తు చేసుకుంటున్నారో వారికి చెందిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ మెయిల్‌తో లాగిన్ అయి వివరాలను అందులో నమోదు చేసుకోవాలి. 2026వ సంవత్సరం జనవరి 11వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్దేశించారు.

అదే విధంగా వివరాలు నమోదు చేసుకున్న అనంతరం తెరపై కనిపించే చిన్న మల్టిపుల్ ఛాయిస్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు)లో ఒక దానికి సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. ప్రతిభ ఆధారంగా ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. విజేతలకు ఎగ్జామ్ వారియర్స్ కిట్లను బహుమతిగా అందజేస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రశంసాపత్రాలను సైతం ఇస్తారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పరీక్షా పే చర్చ నిర్వహించిన ప్రధాని మోదీ విద్యార్ధులకు పలు సూచనలు చేసారు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యం గా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని చెప్పారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సలహాలు ఇచ్చారు. అలాగే పరీక్షలపై విద్యార్థుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి అవకాశం దక్కింది. ఇక, కొద్ది రోజుల్లో పరీక్షా సీజన్ ప్రారంభం కానుండటంతో మరోసారి అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications