జగన్ గెలిచిందీ, చంద్రబాబు ఓడిపోతోందీ అక్కడే ? ఆ సక్సెస్ మంత్ర ప్రయోగానికి వెనకడుగు !

ఏపీలో వైఎస్ జగన్ కు 2019 ఎన్నికల్లో గెలుపుకు పనికొచ్చిన ఓ కీలక అంశం ఇప్పుడు చంద్రబాబుకు మాత్రం ఉపయోగపడే పరిస్దితుల్లో లేదు. అలా అనేకంటే ఉపయోగించుకునే పరిస్దితుల్లో చంద్రబాబు లేరని చెప్పవచ్చు. మరి అప్పుడు జగన్ దాన్ని ఎలా వాడుకున్నారు, చంద్రబాబు ఎందుకు వాడుకోలేకపోతున్నారంటే దానికి మాత్రం చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

వైఎస్ జగన్ సక్సెస్ మంత్ర

వైఎస్ జగన్ సక్సెస్ మంత్ర

ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 175 సీట్లకు గానూ ఏకంగా 151 సీట్లు గెల్చుకుని ప్రత్యర్ధులకు అందనంత దూరంలో నిలిచింది. దీనికి చాలా కారణాలు పనిచేసినా క్షేత్రస్దాయిలో జగన్ చేసిన పోరు ఇందులో ప్రధానమైనది. ముఖ్యంగా విభజన హామీల సాధన కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబుతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై జగన్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ఒత్తిడి కాస్తా ఫలించి చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. ఆ తర్వాత చరిత్రలోనే అతి తక్కువ సీట్లు సాధించి అధికారం కూడా కోల్పోయారు.

అప్పట్లో జగన్ పోరు అలా

అప్పట్లో జగన్ పోరు అలా

2019 ఎన్నికలకు రెండేళ్ల ముందే జగన్ క్షేత్రస్దాయిలో విభజన హామీలకు సంబంధించి పోరాటం ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే మన తల రాతలు మారిపోతాయని విద్యార్దుల్ని నమ్మించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా యువభేరిలు నిర్వహించారు. అదే సమయంలో విభజన హామీల్ని సాధించడంలో చంద్రబాబు వైఫల్యాన్ని ప్రతీ చోటా నిలదీశారు. అసెంబ్లీని బహిష్కరించి మరీ జనంలోకి వెళ్లి విభజన హామీలు సాధిందని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని జనాన్ని కోరారు. చివరికి అదే విభజన హామీల సాధన చంద్రబాబు మెడకు చుట్టుకుంది. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే అవన్నీ సాధిస్తానని జగన్ జనాన్ని నమ్మించారు. దీంతో చంద్రబాబును నిండా ముంచేశారు.

అధికారంలోకి వచ్చాక జగన్

అధికారంలోకి వచ్చాక జగన్

అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ క్షేత్రస్ధాయిలో పోరుకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. దీనికి బదులుగా పార్లమెంటులో విభజన హామీలపై తన ఎంపీలపై ప్రశ్నలు వేయిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అలాగే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ ఎంపీలు ఇవే ప్రశ్నలు కేంద్రానికి పార్లమెంటులో వేసేవారు. అప్పటికీ, ఇప్పటికీ కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో మాత్రం అధికారం చేతులు మారిపోయింది. దీని బట్టి జగన్ ప్లాన్ ఎలా వర్కవుట్ అయిందో అర్దమవుతుంది.

జగన్ బాటలో వెళ్లలేని చంద్రబాబు ?

జగన్ బాటలో వెళ్లలేని చంద్రబాబు ?

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమలు కాని విభజన హామీలపై కేంద్రం కంటే కూడా టీడీపీని జగన్ ఎక్కువగా టార్గెట్ చేశారు. చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విభజన హామీలు అమలు చేయించలేక పోతున్నారనే అంశాన్ని జనంలోకి ఎక్కువగా తీసుకెళ్లేవారు. దాంతో జనం కూడా ఇదే నిజమని నమ్మారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో జగన్ విభజన హామీలు అమలు చేయించలేకపోతున్నారని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అధికారంలో ఉన్న జగన్ తరహాలోనే పార్లమెంటులో ఎంపీల ప్రశ్నలతో సరిపెడుతున్నారు. క్షేత్రస్దాయిలో మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో ఇదే చంద్రబాబుకు మైనస్ గా మారుతోంది.

జగన్ కు, చంద్రబాబుకు తేడా ఇదే !

జగన్ కు, చంద్రబాబుకు తేడా ఇదే !

అయితే జగన్ తరహాలో క్షేత్రస్ధాయిలోకి వెళ్లి విభజన హామీలపై ప్రశ్నించలేని పరిస్ధితుల్లో చంద్రబాబు ఎందుకున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం సులువుగానే దొరుకుతోంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల్ని అమలు చేయించలేకపోయారు. కాబట్టి ఇప్పుడు అదే ప్రశ్న జగన్ కు వేసే పరిస్ధితి లేదు. రాజకీయం కోసం ఆ ప్రశ్న వేసినా జనం నమ్మరన్న భయం చంద్రబాబును వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన క్షేత్రస్ధాయిలో జగన్ ను ప్రశ్నించడం లేదు. ఇదే అదనుగా జగన్ కూడా దీనిపై కాలక్షేపానికే పరిమితం అవుతున్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో ఈ అంశంపై మైలేజ్ దక్కించుకునే అవకాశం లేకుండా పోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+