ఏపీకి కోవిడ్ విరాళాల వెల్లువ- 20 రోజుల్లో రూ.17 కోట్లు- మరో రూ.18కోట్ల ప్రతిపాదనలు

ఏపీలో కరోనా బాధితులకు అండగా నిలుస్తామంటూ వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వస్తున్నాయి. రాష్ట్రంలోని కోవిడ్ బాధితులకు 20 రోజుల్లో రూ. 17 కోట్ల మేర విరాళాలు లభించాయి. ఇందులో పలు ప్రముఖ సంస్ధలు, వ్యక్తులు కూడా ఉన్నారు. మరింత సాయం కోసం భారీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందుతున్నాయి.

Recommended Video

    Corona Vaccine విధానంలో కేంద్రం వివక్ష, సగానికి పైగా డోసులు వారికే || Oneindia Telugu

    ఇప్పటి వరకు వివిధ సంస్థలు, ట్రస్టులు, సొసైటీలు, దాతలతోపాటు విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, పిఎస్‌యులను ప్రభుత్వం సంప్రదిస్తోంది. దీంతో మరో 18 కోట్ల రూపాయల విలువైన సాయం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. దేశంలోని వివిధ సంస్థలు కోవిడ్19 పై పోరాడడం కోసం ఔషధాల రూపంలో, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సర్జికల్ మాస్కులు, రెస్పేరేటర్లు, మందుల పరికరాలు అందించేందుకు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా సాయం అందిస్తున్న సంస్థలు, వ్యక్తుల దాతృత్వం ప్రశంశనీయమని అర్జా శ్రీకాంత్ అన్నారు.

    huge offers of covid help to andhrapradesh, rs.17 cr donations in last 20 days

    ఏపీలో కోవిడ్‌ సాయానికి ముందుకొస్తున్న వారిలో ప్రాంతీయ, గ్రామీణ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన మేరకు సాయమందించేందుకు చాలా మంది ముందుకు రావడం అభినందనీయమని కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్ శ్రీకాంత్ వెల్లడించారు.
    ఇప్పటి రూ. 1.5 కోట్ల విలువైన ముఖ్యమైన మందులను బయోఫొర్, లుపిన్, ఇండియా బుల్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అందించాయని అర్జా శ్రీకాంత్ తెలిపారు.
    రెండో విడత సాయం కింద నిర్మాణ్ ఆర్గనైజేషన్ 13×10 ఐసియు బెడ్లు చొప్పున ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి సమకూర్చుతోందనీ తెలిపారు. మొదటి విడతగా 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ ను ఆరు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులలో యాక్ట్ ఫౌండేషన్ నెలకొల్పిందనీ, రెండో విడతలో మిగతావి నెలకొల్పనుందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+