Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కేబినెట్ లోకి సాయిరెడ్డి..!! ఢిల్లీ కంటే ఏపీలోనే కీలకం - ఆ స్థానం భర్తీ చేసేదెవరు..!!

వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి హోదా మారనుందా. ఢిల్లీలో కాకుండా అమరావతిలో ఆయన సేవలు అవసరమని భావిస్తున్నారా. సీఎం జగన్ ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల దిశగా సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ప్రభుత్వంలో మార్పులు - పార్టీలో పదవుల విషయంలో కసరత్తు చేస్తున్నారు.

Recommended Video

    AP Cabinet Expansion: AP CM Jagan Over cabinet reshuffle | Oneindia Telugu

    రేపు (15వ తేదీ) జరిగే పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ..తన ఆలోచనలు..ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణ పైన క్లారిటీ ఇచ్చారు. సామాజిక సమీకరణాల కారణంగా కొందరిని కొనసాగిస్తూ..మార్పులు అవసరమని స్పష్టం చేసారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయిస్తామని వెల్లడించారు.

    అనూహ్య నిర్ణయాల దిశగా సీఎం..

    అనూహ్య నిర్ణయాల దిశగా సీఎం..

    దీంతో..సామాజిక సమీకరణాలు - సమర్ధత ఆధారంగా నే కేబినెట్ విస్తరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. సమర్ధవంతమైన టీంతో..అదే సమయంలో అటు పార్టీ ..ఇటు పార్టీ వ్యవహారాలను చక్క పెట్టే సమర్ధత ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. అందులో భాగంగా.. మరో అనూహ్య నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో బుగ్గన ను కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

    ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్దిక పరిస్థితుల్లో ఆర్దిక శాఖ మంత్రి కీలకం కానున్నారు. ఒక విధంగా ఆర్దిక మంత్రి బుగ్గన అనేక సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడి నిధులు సమీకరించే ప్రయత్నాలు కొనసాగించారు. ఇప్పుడు రాజ్యసభ కు నాలుగు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అందులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయ సాయిరెడ్డికి రెన్యువల్ ఇస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. కానీ, తాజాగా ఆయనకు సీఎం జగన్ పార్టీ బాధ్యతలు అప్పగించారు.

    సాయిరెడ్డి సేవలు అవసరమనే భావనతో

    సాయిరెడ్డి సేవలు అవసరమనే భావనతో

    కీలమైన అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్ గా నియమించారు. విశాఖ కంటే ఎక్కువగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంటూ అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ఇదే సమయంలో..ఆయనకు రాష్ట్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తారనే ప్రచారం పార్టీలో మొదలైంది. బుగ్గన స్థానంలో ఆయనకు ఆర్దిక శాఖతో పాటుగా..మేకపాటి నిర్వహించిన పరిశ్రమల శాఖను సైతం కేటాయిస్తారని చెబుతున్నారు.

    ఆర్దిక మంత్రిగా ..ఢిల్లీలో సాయిరెడ్డికి ఉన్న పరిచయాలను వినియోగించుకొనే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గౌతమ్ రెడ్డి స్థానంలో నెల్లూరు జిల్లా ..అదే జిల్లాకు చెందిన విజయ సాయిరెడ్డితో భర్తీ చేయటం ద్వారా..ఇప్పుడు ఆయన సేవలు అటు పార్టీ..ఇటు ప్రభుత్వానికి వినయోగించుకోవాలనే ఆలోచన జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, పార్టీ ఏర్పాటు నుంచి విజయ సాయిరెడ్డి ప్రతీ అంశంలోనూ సీఎం జగన్ తో కలిసి ఉన్నారు.

    పార్టీ - ప్రభుత్వంలోనూ బాధ్యతలు ఇస్తారంటూ

    పార్టీ - ప్రభుత్వంలోనూ బాధ్యతలు ఇస్తారంటూ

    ఢిల్లీలో పార్టీ తరపున రాజకీయ నిర్ణయాలు... వైసీపీ తరపున సంధాన కర్తగా సాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే వేళ.. కేంద్రంతో కీలక అంశాల పైన సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సాయిరెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది మరో ప్రశ్న. అయితే, సాయిరెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే ఆ స్థానం ఢిల్లీలో భర్తీ చేసే వారెవరు ఉన్నారనే చర్చ అప్పుడే పార్టీలో మొదలైంది. ప్రధానితో సహా కేంద్రంలోని ముఖ్య శాఖల మంత్రులు..అనేక పార్టీల నేతలతో సాయిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి.

    ఇప్పుడు ఆ స్థాయిలో ఢిల్లీలో సంబంధాలు కొనసాగించే నేత వైసీపీలో ఎవరనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు ఢిల్లీలో సంబంధాల కంటే..ఏపీలో పార్టీ- ప్రభుత్వ నిర్ణయాల అమలు పైనే ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

    సీఎం జగన్ నిర్ణయం పై ఉత్కంఠ

    సీఎం జగన్ నిర్ణయం పై ఉత్కంఠ

    సాయిరెడ్డి పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగానే కాకుండా.. ప్రభుత్వ ముఖ్య ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఇటు అసెంబ్లీలో బుగ్గన సీఎం జగన్ కు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్దిక - శాసనసభా వ్యవహారాల శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటు పార్లమెంట్ లో పార్టీ తరపున విజయ సాయిరెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ చేస్తున్న కసరత్తులో భాగంగా.. తీసుకోబోయే తుది నిర్ణయం పైన ఆసక్తి నెలకొని ఉంది.

    అయితే, సాయిరెడ్డి సేవలు ఢిల్లీ కంటే పార్టీకి.. ఇటు ప్రభుత్వానికి కీలకమనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు సీఎం జగన్ ఎంపీ విజయ సాయిరెడ్డి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది వైసీపీలోనే కాకుండా..రాజకీయంగానూ ఉత్కంఠ కలిగిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+