ఎర్ర చందనం స్మగ్లర్ల వేట మొదలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపే పనిలో ఉన్నారు అటవీ, టాస్క్ ఫోర్స్ అధికారులు. తాజాగా కడప జిల్లా ఖాజీపేట మండలంలోని పొద్దుటూరు అటవీ ప్రాంతంలో ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్ లను పట్టుకున్నారు. నేడు వారు 20 లక్షల రూపాయల విలువ చేసే 53ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
పొద్దుటూరు రేంజ్ లో కూంబింగ్ ఆపరేషన్
తిరుపతి జిల్లా ఎస్పీ, టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో కడప సబ్ కంట్రోల్ కు చెందిన ఆర్ఎస్ఐ పి. నరేష్ టీమ్ నిన్న రాత్రి పొద్దుటూరు రేంజి లోని ఖాజీపేట ఫారెస్టు డివిజన్ నుంచి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్ ల అరెస్ట్
వీరు నేడు తెల్లవారు జామున నాగసానిపల్లి రేంజిలోని పోతభక్తుని బావి ప్రాంతం చేరుకోగా అక్కడ కొందరు వ్యక్తులు మోటారు సైకిల్ తో అనుమానాస్పదంగా కనిపించారు. వారి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చెయ్యగా వారు అక్కడి నుండి పారిపోయారు. అయితే వారిని వెంబడించిన టాస్క్ ఫోర్సు పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరికొందరు తప్పించుకున్నారు.
53 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
వీరిని విచారించగా కొన్ని ఎర్రచందనం దుంగలను కూలీల ద్వారా సేకరించామని, వాటిని రవాణా చేయడానికి సిద్దం చేస్తున్నట్లు వివరించారు. దుంగలు దాచి ఉంచిన ప్రదేశంలో చూడగా, అక్కడ 53ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వీటిని స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన దాడిబోయిన గురుప్రసాద్ , మైదుకూరు మండలానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేష్, బత్తల శివలుగా గుర్తించారు.

అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
పారిపోయిన మరో ముగ్గురు కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపులు చేపట్టారు. అరెస్టయిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ పై పవన్ ఆదేశాల తర్వాత అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు ఫారెస్ట్ మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications