నిద్రిస్తున్న భార్య తల పగులగొట్టి, ఇంటికి తాళం వేసిన భర్త
కాకినాడ: కట్టుకున్న భార్య నిద్రిస్తున్న వేళ తలపై బలంగా కొట్టి రక్తమోడుతుంటే ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడో భర్త. మానవత్వానికే మారుగా ఉన్న ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం కొవ్వాడకు చెందిన వీరదుర్గాభవాని (28)కి రావులపాలేనికి చెందిన పితాని వర ప్రసాద్‌తో పది సంవత్సరాల క్రిందట వివాహామైంది. వీరికి సంతానం లేదు. కొద్దికాలం వీరు రావులపాలెంలో ఉన్నారు.
ఆ సమయంలో వర ప్రసాద్ మద్యం తాగి తరచూ కొడుతుండటంతో దుర్గాభవాని పుట్టింటికి చేరుకుంది. అనంతరం కొవ్వాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఈ నెల 1న సాయంత్రం వర ప్రసాద్ రాత్రి తలపై కొట్టి, ఇంటి బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయాడు.

వారం రోజులుగా ఆమె అక్కడే సృహతప్పి రక్తం మడుగులోనే పడుంది. ఆమె కనిపించకపోవడం, ఇంట్లోంచి దుర్గంధం రావడంతో అనుమానించిన స్ధానికులు ఇంటి తాళాన్ని పగలకొట్టి చుడగా ఇంట్లో ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది.
వెంటనే ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల 1న సాయంత్రం వరప్రసాద్ తనతో బాగానే ఉన్నాడని, ఆరోజు రాత్రి తాను నిద్రిస్తున్నవేళ తలపై కొట్టి తాళం వేసి వెళ్లిపోయాడని బాధితురాలు మీడియా ముందు చెప్పింది.












Click it and Unblock the Notifications