పిచ్చా, భార్యను ముక్కలు ముక్కులుగా నరికాడు

ఐదు వందల రూపాయలు పోగొట్టిందనే కారణంతో ఆమెను భర్త కర్తలతో కొట్టాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికాడు. మొదటి భార్యను కూడా అతనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. చిన్న కారణంగా రెండవ భార్యను హత్య చేయడంపై అతని మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ వ్దద రైలు ఢీకొని తల్లికూతుళ్లు మరణించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం రాజవరంలో ఉన్న డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
రియాక్టర్‌లో ఒత్తిడి పెరిగిన కారణంగానే ఈ ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని పరిశీలిస్తున్న పోలీసులు ఈ పేలుడుకు అసలు కారణం ఏమిటి, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా వుందా అనే కోణంలో విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications