భార్యను అప్పగించండి!: భర్త, కట్నం ఇవ్వలేదని యువకుడు జంప్
విశాఖ: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను అత్తింటి వాళ్లు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని, దీని పైన ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాజేష్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం విశాఖలోని విలేకరుల సమావేశం నిర్వహించారు.
గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో రాజేష్ నివాసముంటున్నాడు. అతను, సరస్వతి అనే యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేష్ తన తల్లిదండ్రులను ఒప్పించి ఈ నెల 12వ తేదీన రిజిస్టర్ మారేజ్ చేసుకున్నాడు. ఈ విషయం రాజమండ్రిలో ఉంటున్న సరస్వతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తిరస్కరించారు.
దీంతో రాజేష్, సరస్వతిలు.. రాజేష్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీన దాదాపు ముప్పై మంది గుర్తు తెలియని వ్యక్తులు కార్లలో వచ్చి ఇంటి వారి పైన దాడి చేసి, కత్తులతో బెదిరించి, భార్యను ఎత్తుకు పోయాడని రాజేష్ ఆరోపించారు. తన భార్యను తనకు అప్పగించేలా చూడాలని కోరారు.

కట్నం ఇవ్వనన్నారని పెళ్లి కుమారుడు జంప్
కోరిన కట్నం ఇవ్వలేదనే కారణంతో పెళ్లికి నిరాకరించి కుటుంబంతో సహాపరారైన యువకుడిపై ఓ పోలీస్ అధికారి కుమార్తె పోలీసులను ఆశ్రయించింది. అనంతపురంకు చెందిన ఓ కుటుంబం విశాఖలో నివాసం ఉంటోంది. వారి కుమార్తె జాహ్నవి తనకు జరిగిన అన్యాయాన్ని బుధవారం విలేకరులకు చెప్పారు.
గీతం కళాశాలలో డెంటల్ మెడిసిన్ చదువుతున్న తనకు, అదే కళాశాలలో బీబీఎం చదువుతున్న పర్వీస్ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు తెలిపింది. పర్వీన్ తనకు కట్నం వద్దని ఆడపడుచు కట్నం కింద 10 లక్షలు ఇవ్వాలని కోరడంతో ఆ మొత్తాన్ని ఇవ్వడంతోపాటు బైక్ కూడా కొనిపెట్టినట్టు చెప్పారు.
డిసెంబర్ 12న పెళ్లి ముహూర్తం నిర్ణయించాక వచ్చి తనకు రెండు కోట్లు, 100 తులాల బంగారం, ఐదు కిలోల వెండి ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు. తాము ఇవ్వలేమని చెప్పగా అయితే తాను పెళ్లి నిర్ణయం విరమించుకుంటున్నానంటూ వెళ్లిపోయాడని చెప్పారు. కుటుంబం మొత్తం ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో పరారైపోయారని ఆరోపంచారు. పోలీసులకు పర్వీస్ తోపాటు అతని తల్లిదండ్రులు, సోదరిపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications