హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నారై ఇంట్లో చోరీ: 39 లక్షల సొత్తు అపహరణ

|
Google Oneindia TeluguNews

 NRI's house burgled
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రవాస భారతీయుడి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. తన కుమారుడి వివాహం నిమిత్తం కెనడా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారింట్లో ఈ దోపిడీ చోటు చేసుకోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చంచల్‌గూడ న్యూ‌రోడ్‌లోని వారి నివాసంలో 96 తులాల బంగారం, 1,200 కెనడియన్ డాలర్లు, లక్ష రూపాయల నగదు, రెండు ఐ ఫోన్లు బుధవారం రాత్రి చోరీకి గురయ్యాయి. వీటి మొత్తం విలువ రూ. 39 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు తెలిపారు.

దబీర్‌పురా ఇన్‌స్పెక్టర్ డివి రంగారెడ్డి కథనం ప్రకారం... గత 25 ఏళ్లుగా కెనడాలో ఉంటున్న మక్బుల్ అలీఖాన్ తన కుమారుడి వివాహాన్ని జరిపించేందుకు హైదరాబాద్‌లోని తన తల్లి ఉంటున్న ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు వివాహ పనులు పర్యవేక్షించేందుకు కుటుంబ సభ్యులతోపాటు మక్బుల్ స్థానిక అంజుమన్ ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నారు. కాగా అదే రాత్రి 1.05 గంటలకు తన ఇంటిపై ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పొరుగువారు మక్బుల్‌కి ఫోన్ చెప్పారు.

దీంతో హుటాహుటిన మక్బుల్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇంట్లోని 96 తులాల బంగారు నగలతోపాటు మిగితా విలువైన సామాగ్రితో దొంగలు పరారయ్యారు. అయితే ఇంట్లోని ఓ గది గ్రిల్ తలుపును వేయకపోవడంతో దొంగలు అక్కడి నుంచే ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. గురువారం కుమారుడి వివాహం ఉన్న నేపథ్యంలో ఈ దోపిడీ జరగడంతో మక్బుల్ కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. అయితే వివాహ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని పోలీసులు తెలిపారు.

మక్బుల్ వివాహం కోసం 200 తులాల బంగారాన్ని తీసుకొచ్చాడని, అందులో 96 తులాలు చోరీకి గురయ్యాయని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మరో కేసులో కెపిహెచ్‌బిలోని బ్యూటీ పార్లర్, ఫొటో స్టూడియో, టేలర్ షాపుల్లో చోరీలు జరిగాయని చెప్పారు.

English summary

 An NRI from Canada, who came here to perform his son's marriage, had a bitter experience as burglars struck at his house in Chanchalguda New Road and made away with 96 tolas gold, 1,200 Canadian dollars, Rs one lakh Indian currency and two iPhones on Wednesday night. In all, the loss of property was pegged at Rs 39 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X