'సాఫ్ట్‌వేర్' చోర్: 16 దొంగతనాలు, ఈసారి కారుతో చిక్కాడు
కాకినాడ: హైదరాబాద్‌కు చెందిన నడింపల్లి వినయ్‌కుమార్ అనే యువకుడు తన సాఫ్ట్‌వేర్ కంపెనీ మూతపడటంతో దొంగగా మారాడు. కొన్ని కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో మరో దొంగతనంచేసి చిక్కాడు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రవీంద్రనాథ్ అత ని వివరాలను తెలిపారు.
హౌసింగ్ బోర్డు కాలనీలోని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీర్రాజు ఇంట్లో మే 22న జొరబడి 92 గ్రాముల బంగారు గాజులు, కారును దొంగిలించాడు. బైపాస్ రోడ్డు లో సోమవారం వాహనాలను తనిఖీచేస్తుండగా దొంగిలించిన కారుతో వినయ్‌కుమార్ పట్టుబడ్డాడు. అతనిని అరెస్టుచేసి గాజులను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వినయ్‌కుమార్ భార్యది గుంటూరు కావడంతో విజయవాడ, గుంటూరులను కేంద్రంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడినట్టు డీఎస్పీ తెలిపారు. ఇంతవరకు 16 దొంగతనాలకు పాల్పడినట్టు ఆయన చెప్పారు. కారు ఉన్న ఇళ్లనే ఎంచుకొని కారుతో సహా దొంగతనంచేయడం ఇతని ప్రత్యేకతగా చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన నడింపల్లి వినయ్‌కుమార్ ఎంబీఏ చదివి, కొంతకాలం పాటు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహించి 40 మందికి ఉపాధి కల్పించాడు. అది నష్టాల్లో కూరుకుపోవడంతో దొంగగా మారాడు. ఇప్పటి వరకు విజయవాడలో 12, రాజమండ్రిలో 3 దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపాడు. అలాగే ఈ ఏడాది జనవరి 9 నుంచి మార్చి 13 వరకూ విజయవాడలో జైలు శిక్ష అనుభవించినట్టు చెప్పాడు. 2014 నవంబర్ నుంచి దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు.












Click it and Unblock the Notifications