నటిగా రాణించా, రాజకీయాల్లో కాలేదు: శారద

నటీనటులకు రిటైర్మెంట్ లేదని, మంచి పాత్రలు వస్తే తాను మళ్లీ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం సినిమా రంగం విలువలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థం పర్థం లేని డైలాగులు, డాన్సులు చూస్తుంటే సినిమాలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నాయన్నారు. కుటుంబ సభ్యులు కలిసి సినిమాలు చూసే రోజులు పోయాయన్నారు.
కాగా, 1945లో గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన శారద తెలుగులో ఊర్వశి శారదగా పేరుగాంచింది. ఆమె తెలుగుదేశం పార్టీలో పని చేశారు. లోకసభకు ప్రాతనిథ్యం వహించారు.
శారద 1968లో తులాభారంలో, 1927లో స్వయంవరంలో, 1977లో నిమజ్జనంలో నటించి జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. 1979లో కేరళ స్టేట్ ఫిల్మ్ ఫేర్ అవార్డును ఇచ్చింది. 2010లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వచ్చింది.












Click it and Unblock the Notifications