మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! (వీడియో)
మెగా కుటుంబంలో ఇటీవలే పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. ఇటీవల మెగా హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండు వారాలకే ఈ జంట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత ఈ నూతన జంట మొదటిసారిగా ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2026లో మెరిశారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా షోను వీక్షించేందుకు వీరు మొదటి వరుసలో కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది!
ఫ్యాషన్ షో జరుగుతుండగా నయనిక చాలా తీక్షణంగా ర్యాంప్ వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్స్, ఆ చూపులు చూస్తుంటే ఎవరో ఆవహించినట్లుగా లేదా చాలా కోపంగా ఉన్నట్లుగా అనిపించింది. ఓ రగంగా ఆ హావభావాలు భయానకంగా ఉన్నప్పటికీ.. అందులో ఓ తెలియని ఫన్నీ యాంగిల్ కూడా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆమె పక్కనే ఉన్న అల్లు శిరీష్ మాత్రం చాలా రిలాక్స్‌గా తన ఫోన్ చూసుకుంటూ కనిపించారు.

సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం
కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "ఏంటి నయనిక గారు.. అలా చూస్తున్నారు? ఎవరైనా భయపడాల్సిందే!" అని ఒకరు.."ఇది పక్కా ప్రొటెక్టివ్ వైఫ్ ఎనర్జీ.. శిరీష్ జాగ్రత్త!" అని మరొకరు జోకులు పేల్చుతున్నారు. మరికొందరు ఈ వీడియోను హారర్ సినిమాల మ్యూజిక్‌తో ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Vammo Ee akka ala chustuntey naku bhayam vestundi 😭😳🤣 pic.twitter.com/bfutYMDcKF
— ᵁᵇˢғʀᴏᴏᴛʏ🦁 (@Mouli_Ka) March 20, 2026
సహజత్వానికి ఫిదా
నిజానికి సెలబ్రిటీలు కెమెరా ముందు ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ వీడియోలో నయనిక హావభావాలు చాలా నేచురల్‌గా ఉండటం విశేషం. పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఆమె షోలో లీనమైపోవడం, పక్కనే శిరీష్ క్యాజువల్‌గా ఫోన్ చూసుకోవడం.. ఒక సాధారణ భార్యాభర్తల మధ్య ఉండే మూమెంట్ లాగే ఉందని మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఏదేమైనా ఒక్క చూపుతో నయనిక ఈ ఫ్యాషన్ వీక్ మొత్తానికే హైలైట్‌గా నిలిచారు.












Click it and Unblock the Notifications