విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ??
మెగా డాటర్ "నిహారిక కొణిదెల" గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగబాబు కుమార్తెగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించింది. "ముద్దపప్పు అవకాయ" సహా పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సైతం యాంకర్ గా సత్తా చాటింది. ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి "ఒక మనసు" చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు పొందగలిగింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
హీరోయిన్ గా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోవడంతో.. నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. "పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వెబ్ సిరీస్‌లు, చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. "డెడ్ లైన్", "కమిటీ కుర్రోళ్లు" వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించి, కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే నిర్మాతగా నిలిచింది. ప్రస్తుతం "రాకాసా" సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా, దానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ మూడో తేదీ ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిహారిక తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత అంశాలపై కూడా ఓపెన్ అయ్యారు. కాగా నిహారిక.. జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వీరి వివాహం పెళ్లి తర్వాత ఏడాది పాటు సవ్యంగానే సాగినప్పటికీ.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే విడాకులు తీసుకున్నారు. ఈ జంట విడాకులు తీసుకొని దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో తన డీవోర్స్ గురించి నిహారిక ఓపెన్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఆమె ఏం చెప్పారంటే..
విడాకులు నిర్ణయం తీసుకున్న వెంటనే మీరు ముందుగా ఎవరితో చెప్పారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నలకు నిహారిక సమాధానం చెబుతూ తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా నాన్నకు చెప్పానని తెలిపారు. నాన్నకు ఈ విషయం చెప్పగానే సైలెంట్ గా విన్నారు వాళ్లు కూడా పెళ్లి తర్వాత నన్ను చూశారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవనుకున్నప్పుడు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు అంటూ చెప్పారు. ఎవరు కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు అయితే మా మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివని ఓపెన్ అయ్యారు. అందుకే ఇద్దరం కలిసి విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం మంచిదనిపించిందని నిహారిక తెలిపారు.
అలానే ఒకరినొకరు బాగా కొట్టుకొని విడిపోతే అది తొందరగా మరచిపోతామని.. కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా విడాకులు అనేది ఇప్పుడు తీసుకుంటున్నది కాదని, ఎప్పటినుంచో ఉందని తెలిపారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్ గా అతనితో ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారా? అనే ప్రశ్న ఎదురవడంతో అలాంటిది ఏమీ లేదని ఎక్కడ కాంటాక్ట్స్ లేవని నిహారిక ఈ సందర్భంగా మరోసారి తన విడాకుల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications