తెలంగాణ కోసం అడిగా: బాబు, ఎపి సమస్యలపై ఢిల్లీకి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణకు కూడా సాయం చేయాలని తాను కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరానని ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రానున్న ఐదేళ్ల కోసం విద్యుత్ సంస్కరణలను తాము ప్రారంభిస్తున్నామన్నారు.
విద్యుత్‌కు సంబంధించి కేంద్రం సాయాన్ని తాము కోరామని చెప్పారు. పరిశ్రమలు, ఇళ్లు, వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరాకు పథకాలు రచిస్తున్నామన్నారు. ఎన్టీపీసీ, రైల్వే లైన్లకు బొగ్గును కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.

రానున్న రెండు నెలల్లో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. తెలంగాణకు కూడా సాయమందించాలని తాను కోరానని, అందుకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎపీలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
సౌర, పవన విద్యుత్ అంశాలపై చర్చ: సుజన
విద్యుత్ మంత్రితో భేటీలో సౌర, పవన విద్యుత్ అంశాలపై చర్చ వచ్చిందని ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. సెప్టెంబరులోపు 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బొగ్గు సరఫరా పైన చొరవ తీసుకుంటామని చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications