Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నయ్యని బాధపెట్టి వచ్చా, శంకిస్తే వేరేవ్యక్తిని!: పవన్ హెచ్చరిక, బాబుతో గొడవకి సిద్ధం

పెనుమాక: తనకు తండ్రి తర్వాత తండ్రి వంటి అన్నయ్య (చిరంజీవి) మనసును గాయపర్చి తాను గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపికి మద్దతిచ్చానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం అన్నారు. పెనుమాకలో రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రజల కోసమే తాను టిడిపి - బిజెపికి మద్దతిచ్చానని తెలిపారు. ఆయన మనసు గాయపరిచానని చెప్పారు. ఎవరైనా తన చిత్తశుద్ధిని శంకిస్తే నేను మరో వ్యక్తిని అవుతానని హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి రావడానికి రెండే కారణాలు అని చెప్పారు. ఒకటి శాంతిభద్రతలు, అమ్మాయిల పైన దాడులు అన్నారు.

మీరు టిక్కెట్లు కొని ఇచ్చిన డబ్బులతోనే..

రాజధాని నిర్మాణం అనే మంచి పని కోసం నేను రూ.50 లక్షలు ఇచ్చానని గుర్తు చేశారు. అది కూడా మీరు టిక్కెట్లు కొని ఇచ్చే డబ్బులతోనే అని పవన్ జనాలను ఉద్దేశించి అన్నారు.

I came here as a farmer: Pawan Kalyan responds on Chiranjeevi

సినిమా ప్లాపైతే రెమ్యునరేషన్ తిరిగిచ్చా

తన సినిమా ఒకటి అట్టర్ ప్లాప్ అయితే తాను రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చానని, సినిమా విషయంలోనే తాను ఇంత బాధ్యతాయుతంగా ఉండానని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం మరెంత బాధ్యతగా ఉండాలని నిలదీశారు. కాబట్టి రైతులకు రాజపత్రం ఇవ్వాలన్నారు.

సినిమాపరంగా తనను ఇష్టపడే చాలామంది ఉంటారని, కానీ రాజకీయాల పరంగా వారు మరొకరిని ఇష్టపడతారన్నారు. దానిని తాను తప్పుపట్టనని చెప్పారు. తనను అభివృద్ధికి ఆటంకం అని చెబుతున్నారని, తప్పు వేలెత్తి చూపితే కోపం వచ్చిందా అన్నారు.

అందరూ సమానమే

తన ఇద్దరు కూతుళ్లకు ఒకరికి చర్చిలో, మరొకరికి గుడిలో నామకరణం చేశానని చెప్పారు. తనకు కులాలు, మతాలు అంటించవద్దన్నారు. తాను రైతుగా, రాజకీయ నాయకుడిగా పెనుమాక రాలేదని, రైతుగా వచ్చానని చెప్పారు.

రైతుగా వచ్చా.. పారిపోను

నేను తోటి రైతుగా ఇక్కడకు వచ్చానని, రైతు కావాలన్నది తన కోరిక అని చెప్పారు. శాంతిభద్రతలు, అమ్మాయిల పైన జరుగుతున్న దాడులే తాను రాజకీయాల్లోకి రావడానికి కారణమని చెప్పారు. నేను మీకు అండగా ఉండేందుకే వచ్చానని చెప్పారు. నేను పారిపోయేందుకు రాలేదన్నారు.

వీధి పోరాటాల కోసం రాజకీయ పార్టీ పెట్టడం కాదన్నారు. గొడవ పెట్టుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని తాను అనుకోవడం లేదన్నారు. రాజకీయాలు, సినిమాల కంటే రైతుగా ఉండేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు.

చంద్రబాబుతో గొడవ పెట్టుకునేందుకు కాదు.. అవసరమైతే పెట్టుకుంటా

తాను టిడిపితోనే, చంద్రబాబుతోనో గొడవ పెట్టుకునేందుకు రాలేదన్నారు. గొడవ పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారమైతే చంద్రబాబుతో అందుకు సిద్ధమన్నారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవడమే నాకు ఇష్టమన్నారు. టిడిపితో గొడవ పడటం తనకు సమయం పట్టదన్నారు.

ప్రత్యేక పరిస్థితుల్లో...

తాను ప్రత్యేక పరిస్థితుల్లో టిడిపి - బిజెపికి మద్దతిచ్చానని చెప్పారు. రాజధాని లేకుండా, పద్ధతి లేకుండా విభజన చేశారన్నారు. నేను ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటానని చెప్పారు. మంత్రి రావెల కిషోర్ పదేపదే ఆఫ్టరాల్ 3వేల ఎకరాలు అనవద్దని, ఎకరం భూమి పైన ఎంతోమంది బతుకుతున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+