Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్‌కు రేవంత్ సవాల్: కిషన్ ఫైర్, ఎవరోనని కెటిఆర్

Revanth reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి సోమవారం సవాల్ చేశారు. కెసిఆర్ మళ్లీ పోటీ చేస్తే గెలుపొందటం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని... అమ్మ గుడి కట్టాలని చెబుతున్న కాంగ్రెసు నాయకులు ముందుగా తెలంగాణ కోసం అమరులైన పన్నెండుమంది సమాధులు కట్టి వాటి మధ్య ఆమె గుడి కట్టాలన్నారు. అమరుల సమాధుల మధ్య సోనియా గాంధీకి గుడి కడితే అమ్మ వారిని బలితీసుకుందని భవిష్యత్తు తరాలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

కెసిఆర్‌పై కిషన్ రెడ్డి నిప్పులు

మోడీ.. గీడీ అన్న కెసిఆర్ పైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాము కెసిఆర్.. గీసిఆర్ అని కూడా అనవచ్చని ఎద్దేవా చేశారు. మోడీ లేరంటూ కెసిఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ఉదయం తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో.. మోడీ ప్రధాని కావడం అంతే వాస్తవమన్నారు. మోడీకి ఓటు వేయవద్దని కెసిఆర్ చెప్పడమేమిటన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు.

ఎవరు కావాలి: కెటిఆర్

ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రం.. మన పార్టీ... మన పాలన నినాదంతో ముందుకు సాగాలని తెరాస ఎమ్మెల్యే కెటి రామారావు పిలుపునిచ్చారు. ఢిల్లీకి తల వంచేవాళ్లు కావాలా లేక ఢిల్లీ మెడలు వంచేవాళ్లు కావాలా ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. అధిష్టానం ఫోన్ కాల్‌కే వణికిపోయే నాయకుల వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+