Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన ఎఫెక్ట్: ఫిబ్రవరి 11న, పవన్‌తో భేటీ, పొలిటికల్ రిస్క్: ఉండవల్లి

రాజమండ్రి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు బుధవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో జెఎసి ఏర్పాటు చేసే విషయమై కలిసిరావాలని పవన్ కళ్యాణ్‌ తనను కోరారని, దీనికి సానుకూలంగా స్పందించినట్టు ఉండవల్లి అరుణ్‌ కుమార్ చెప్పారు.

Recommended Video

    Undavalli Arun Kumar Fires Over Budget 2018

    బడ్జెట్‌లో ఏపీకి అరకొర నిధుల కేటాయింపులపై రాజకీయాల్లో మార్పులు అనుహ్య పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టిడిపితో పాటు, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

    పార్లమెంట్‌లోపల, బయట రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 8వ, తేదిన ఏపీ రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి.

    టిడిపి కూడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు.

    ఫిబ్రవరి 11న, పవన్ కళ్యాణ్‌తో సమావేశం

    ఫిబ్రవరి 11న, పవన్ కళ్యాణ్‌తో సమావేశం

    ఫిబ్రవరి 11వ, తేదిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో సమావేశం కానున్నట్టు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ఆందోళనలు నిర్వహించే విషయమై జెఎసి ఏర్పాటు చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ప్రకటించారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే జెఎసితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు.

    పవన్ కళ్యాణ్‌కు ఏపీ రాష్ట్రానికి సేవ చేయాలనే తపన ఉంది

    పవన్ కళ్యాణ్‌కు ఏపీ రాష్ట్రానికి సేవ చేయాలనే తపన ఉంది

    ఏపీ రాష్ట్రానికి సేవ చేయాలనే తపన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జేఏసీకి సహకరిస్తానని తెలిపారు. యుద్ధవాతావరణం సృష్టించే శక్తి తనకు లేదని.. అలాంటి అంచనాలు వద్దని పవన్‌ కళ్యాణ్ తో చెప్పినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

    పవన్ కళ్యాణ్ ఆలోచన తెలిశాక మాట్లాడుతా

    పవన్ కళ్యాణ్ ఆలోచన తెలిశాక మాట్లాడుతా


    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటో తెలిసిన తర్వాత తాను మరిన్ని విషయాలపై స్పందించనున్నట్టు ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు.జెఎసి ఏర్పాటు విషయమై పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ముందు తాను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

    పవన్ కళ్యాణ్ పొలిటికల్ రిస్క్ తీసుకొన్నారు.

    పవన్ కళ్యాణ్ పొలిటికల్ రిస్క్ తీసుకొన్నారు.

    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా రిస్క్ తీసుకొన్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన పవన్ కళ్యాణ్‌కు ఉందని ఉండవల్లి అరుణ్ ‌కుమార్ అభిప్రాయపడ్డారు. పోరాటాలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రజలు సిద్దంగా లేరనే విషయాన్ని తాను పవన్ కళ్యాణ్‌కు చెప్పానని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+