నేనే కాదు కిరణ్ కూడా ఉండరు: టిపై లగడపాటి ప్రతిజ్ఞ
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని విజయవాడ పార్లమెంటు సభ్యులు, సీనియర్ కాంగ్రెసు నాయకులు లగడపాటి రాజగోపాల్ ఆదివారం పునరుద్ఘాటించారు. విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల నుండి తప్పుకుంటారని తాను భావిస్తున్నానని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎపిఎన్జీవోల పోరాటం అమోఘమని కొనియాడారు. ఆయన చిత్తూరు జిల్లాలో ఈ రోజు మాట్లాడారు.
కాగా, శనివారం కూడా లగడపాటి రాజగోపాల్ విభజన జరిగితే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగా నిలుపలేకపోతే కిరణ్ కూడా రాజకీయాల్లో కొనసాగరని లగడపాటి నిన్న తిరుపతిలో అన్నారు. రాష్ట్ర సమైక్యతపై కిరణ్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. అందుకే తన అంచనాతో ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.

అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానిస్తే సమైక్యానికి 95 శాతం అనూకూలత పెరుగుతుందన్నారు. విభజనకు 5 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయన్నారు. సమైక్యంగా ఉంచే విషయంలో స్టార్ బ్యాట్సుమెన్ అర్జునుడిలా విజయం సాధిస్తారా.. అభిమన్యుడిలా పద్మవ్యూహంలో చిక్కుకుంటారా అని రాష్ట్రం ఆసక్తిగా గమనిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications