బయటపెడ్తా: జగన్‌పై డిఎల్, బాబు వైపు, టిడిపిలోకి తోట

అదే సమయంలో సీమాంధ్రలో టిడిపికి ఆదరణ పెరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో జగన్ కూడా భాగస్వామి అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. కడపలోని ప్రజాగర్జన సమయంలో తాను టిడిపిలో చేరుతానని చెప్పారు. డిఎల్ ఉదయం చంద్రబాబును కలిశారు.
టిడిపిలోకి తోట
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తోట నర్సింహం శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో నాయకుడు చిట్టూరి రవీంద్ర కూడా చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో పలువురు కాంగ్రెసు నేతలు టిడిపిలో చేరుతున్న విషయం తెలిసిందే.
కక్ష కట్టారన్న కావూరి
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించినందుకు, తనపై కక్షగట్టారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు ఆరోపించారు. అందువల్లే తన సంస్థ ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ను తెరమీదకు తీసుకొచ్చారని అన్నారు. ఈ విషయంపై మాట్లాడటానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని, తాము ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు.












Click it and Unblock the Notifications