అసెంబ్లీ బాగుంది, వర్షం నీళ్ళు వస్తే వివాదం చేయాలా?: ఉండవల్లి
2019 ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించారు ఉండవల్లి అరుణ్ కుమార్అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవనం బాగుందన్నారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని ఆయన చెప్పారు
అమరావతి: తాను 2019 ఎన్నికల్లో పోటీచేయబోనని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవనం బాగుందన్నారు.
అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం నాడు సందర్శించారు. భనవ నిర్మాణం బాగుందన్నారు. వర్షం నీరు వచ్చినంత మాత్రాన వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు.

తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని కూడ ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో తెలిసినవాళ్ళున్నందున వారితో కలిసి పచ్చినట్టు చెప్పారు.
అసెంబ్లీ భవనం బాగుందని చెబితే టిడిపిలోకి వెళ్తున్నానని, బాగాలేదని చెబితే వైసీపీలోకి వెళ్తున్నానని అనుకొంటారని చెప్పారు. కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనం మాత్రం బాగా ఉందని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications