సీనియర్ ఐఎఎస్‌కు వైసీపీ కండువా: అసెంబ్లీ బరిలో..

YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.

ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు. ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇదే బాటలో ఉన్నారు.

IAS officer Imtiaz Ahmed likely to join in YSRCP

ఈ క్రమంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి.. వైఎస్ఆర్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సమాచారం. తన సర్వీసులకు రాజీనామా చేసి మరీ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఆయనే- ఇంతియాజ్ అహ్మద్. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది. ఆయన సొంత జిల్లా కర్నూలు.

తన సర్వీసులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ.. ఇంతియాజ్ అహ్మద్‌ను బరిలోకి దించుతుందని అంటున్నారు. మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల పార్టీకి లాభిస్తుందని అంచనా వేస్తోంది.

ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్‌ను మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తుందని తెలుస్తోంది. కర్నూలు టికెట్‌ను ఆశిస్తోన్న మరో సీనియర్ నేత ఎస్వీ మోహన్ రెడ్డికి కర్నూలు మేయర్ పదవిని ఇస్తారని చెబుతున్నారు. బీవై రామయ్యకు కర్నూలు లోక్‌సభ టికెట్ దాదాపుగా ఖాయమైందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+