• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ ను అవమానించినా.. మంత్రులు చేయలేనిది..అధికారి చేసారు : ఢిల్లీకి చేరిన పంచాయితీ..ప్రధానికి సైతం..

|

ఏపీ ప్రభుత్వంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేసిన కర్నాటక పారిశ్రామిక వేత్త వేత్త టి.వి.మోహన్‌దాస్‌ పాయి సీఎం కు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వంలోని కీలక అధికారి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి మోహన్‌దాస్‌ పాయి ఆంధ్రాలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందని వ్యాఖ్యానించారు. చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేవాదాయ భూములను కబ్జా చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని దేవాదాయ భూములకు కేంద్ర ప్రభుత్వం రక్షణ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ..హోం మంత్రి అమిత్‌షాక్‌ ట్యాగ్‌ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి పైన ఇంత తీవ్ర ఆరోపణలు చేయటం ..జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా ఒక్క మంత్రి నోరు విప్పలేదు. తమ ముఖ్యమంత్రికి బాసటగా నిలివలేదు. ఆ అధికారి మాత్రం ఏ మాత్రం చర్యలకు భయపడలేదు. ట్విట్టర్ ద్వారా ఆ పారిశ్రామికవేత్తను హెచ్చరించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

సీఎం జగన్ పై పాయ్ సంచలన ఆరోపణలు..

సీఎం జగన్ పై పాయ్ సంచలన ఆరోపణలు..

కర్నాటక కు చెందిన పారిశ్రామిక వేత్త టి.వి.మోహన్‌దాస్‌ పాయి ముఖ్యమంత్రి జగన్ ను అవమానించేలా ట్వీట్లు చేసారు. జగన్ తీసుకున్న నిర్ణయాల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పీపీఏల సమీక్ష నిర్ణయం పైన అభ్యంతరం చెబితే తప్పు లేదు కానీ..ఆయన తన ట్వీట్ లో ఆంధ్రాలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ ని కుదేలయ్యేలా చేసారని ఆరోపించారు. పీపీఏ లసమీక్షతో ఆగకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కొందరి మత పెద్దల ఒత్తిడి మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేవాదాయ భూములను కబ్జా చేస్తోందని ఆరోపించారు. ఆ ట్వీట్ ను ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా కు ట్యాగ్ చేసారు. దీని పైన వివాదం చెలరేగింది. జగన్ తాను తీసుకున్న పీపీఏల విషయం పైన అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కేవలం ధరలు తగ్గించమని కోరుతున్నందుకే గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. విదేశీ రాయబారుల సమావేశంలోనూ ఈ నిర్ణయం వెనుక కారణాలను వివరించారు. అయితే, జపాన్ సంస్థలు నేరుగా కేంద్రానికి అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ పైనా కర్నాటక కు చెందిన టి.వి.మోహన్‌దాస్‌ పాయి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాయి.

  కడప లో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి || Jagan Mohan Reddy Is Going To Visit Kadapa Tomorrow

  ముఖ్యమంత్రిని అవమానించినా..చంద్రబాబు ఆరోపించినా..

  ఆంధ్రాలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందంటూ పొరుగు రాష్ట్ర పారిశ్రామికవేత్త ఆరోపిస్తే..దీనికి ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఇది ముఖ్యమంత్రిని.. ఏపీ ప్రజలను అవమానించటమే అని చెబుతున్నారు. టి.వి.మోహన్‌దాస్‌ పాయి చేసిన ట్వీట్ల గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నా ప్రభుత్వంలోని మంత్రులు..పార్టీలోని సీనియర్లు ఏ ఒక్కరూ స్పందించలేదు.

  జగన్ ప్రభుత్వంలో ఉన్న 25 మంది మంత్రుల్లో ఏ ఒక్కరికీ దీని పైన స్పందించాలనే ఆలోచన రాలేదు. పీపీఏల వివాదం కావటం తో సంబంధింత మంత్రి ఇప్పటి వరకు అసలు ఆ విషయం గురించే మాట్లాడిన సందర్భం లేదు. ఇక, పరిశ్రమల మంత్రి.. ఆర్దిక మంత్రి.. అయిదుగురు ఉప ముఖ్యమంత్రులకు తమ ముఖ్యమంత్రి పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నా.. స్పందించలేదు. పార్టీ సీనియర్లు సైతం ముఖ్యమంత్రి గురించి చేస్తున్న ఆరోపణలు..మద్దతుగా టీడీపీ చేస్తున్న ప్రచారం పైన వైసీపీ నేతలు పట్టించుకోవటం లేదు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉండటంతో.. మంత్రులు .. పార్టీ నేతలు సైతం విశ్రాంతి మూడ్ లో ఉన్నారు. చంద్రబాబు ఇంటి గురించి చూపించిన శ్రద్ద ముఖ్యమంత్రి ఇమేజ్ గురించి చూపించటం లేదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తం అవుతోంది. కనీసం ఈ స్థాయి చర్చ కూడా మంత్రుల్లో.. పార్టీలో జరగకపోవటం దాని పైన నేతలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

  ప్రధానికి విషయం చేరినా..అధికారి మాత్రం ధీటుగా

  ప్రధానికి విషయం చేరినా..అధికారి మాత్రం ధీటుగా

  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని అవమానించిన పారిశ్రామిక వేత్త టి.వి.మోహన్‌దాస్‌ పాయి ఆయనకు క్షమాపణ చెప్పాలని అడిషినల్‌ చీఫ్‌ సెక్రటరీ పి.వి.రమేష్‌ డిమాండ్‌ చేశారు.

  ఆంధ్రా ప్రజలను మోహన్‌దాస్‌ అవమానించారని ఆయన మండి పడ్డారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని..ఆయన చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని..సహనానికి ఒక హద్దు ఉంటుందని చెబుతూనే.. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన మోహన్ దాస్ పాయ్ తక్షణం వై.ఎస్‌.జగన్‌క..అదే విధంగా ఆంధ్రా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోహన్ దాస్ పాయ్ తన ట్వీట్ ను నేరుగా ప్రధానికి ట్యాగ్ చేసారు. దేవాదాయ భూములు కాపాడాలని ఆ ట్వీట్ లో సారాంశం. అయినా..అధికారి స్థాయిలో ఉండి..తాను స్పందిస్తే వివాదానికి కారణమవుతానని తెలిసి కూడా..ఆయన ముఖ్యమంత్రి జగన్ మీద చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది. తమకు తమ ప్రభుత్వాధినేత గౌరవం ముఖ్యమని ఆ అధికారి వ్యాఖ్యానించారు. జగన్ అమెరికా నుండి వచ్చిన తరువాత దీని పైన మంత్రులకు అక్షింతలు వేయటం ఖాయమని చెబుతున్నారు.

  English summary
  An IAS officer seriously reacted on indutrialist who tweeted seruious allegations agianst AP CM Jagan. IAS officer PV Ramesh Demanded apology to AP Cmfrom Mohan Das pai. Now This issue became hot tolic in AP Govt circles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more