వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ అసమర్ధత వల్లే ఐఏఎస్ లకు శిక్ష పడింది; సీఎం రాజీనామా చెయ్యాలి: వర్ల రామయ్య

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ఉగాది నాడు కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. న్యాయ వ్యవస్థ పై సీఎం జగన్ వ్యతిరేకత పెంచుకున్నారని పేర్కొన్న ఆయన, జగన్ తీరును తప్పుబట్టారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు లో పలువురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది అని పేర్కొన్న వర్ల రామయ్య దీనికి కారణం సీఎం జగన్ అంటూ ఆరోపించారు.

ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు అండగా.. ఉగాదినాడు పవన్ కళ్యాణ్ కీలకప్రకటన!!ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు అండగా.. ఉగాదినాడు పవన్ కళ్యాణ్ కీలకప్రకటన!!

జగన్ కు న్యాయ వ్యవస్థపై వ్యతిరేకత.. అందుకే ఐఏఎస్ లకు శిక్ష

జగన్ కు న్యాయ వ్యవస్థపై వ్యతిరేకత.. అందుకే ఐఏఎస్ లకు శిక్ష


ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడం దేశ చరిత్రలోనే లేదని వర్ల రామయ్య మండిపడ్డారు. సీఎం జగన్ కు న్యాయవ్యవస్థ పై ఉన్న వ్యతిరేకత తో ఐఏఎస్ అధికారులకు కూడా శిక్షలు తప్పడం లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. అయితే న్యాయ వ్యవస్థతో అధికారులు జైలు శిక్ష నుండి తప్పించుకున్నా, సేవా కార్యక్రమాలు చేయాలని కోర్టు సూచించింది అని పేర్కొన్నారు వర్ల రామయ్య.

జగన్ అసమర్ధత వల్లే అధికారులకు శిక్ష పడింది

జగన్ అసమర్ధత వల్లే అధికారులకు శిక్ష పడింది


జగన్ అసమర్థత వల్లే అధికారులకు శిక్ష పడిందని వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ రాచరిక పోకడల వల్లే ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడ్డారని పేర్కొన్నారు. జగన్ కు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం స్థానంలో జగన్ కాకుండా మరెవరైనా ఉంటే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసేవారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జగన్ అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసిన వర్ల రామయ్య, అందుకే తప్పు చేసిన మంత్రులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.

 ఐఏఎస్ లకు శిక్ష పడటంతో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన వర్ల రామయ్య

ఐఏఎస్ లకు శిక్ష పడటంతో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన వర్ల రామయ్య

ఇటీవల ఏపీ హై కోర్టు, కోర్టు ధిక్కరణ కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. దీంతో ఐఏఎస్ అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పగా జైలు శిక్ష నుండి ఐఏఎస్ అధికారులు సేవా కార్యక్రమాలు చేయాలని తీర్పును సవరించింది. ఇక ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వర్ల రామయ్య కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

English summary
Varla Ramaiah said the IAS was punished for Jagan's incompetence and the CM should resign as he was morally responsible for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X