అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.80 లక్షలు డిమాండ్ చేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి?

|
Google Oneindia TeluguNews

మైనింగ్‌ లీజులు దక్కించుకోవాలంటే లక్షలాది రూపాయల ఖర్చవుతుందని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి డిమాండ్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మితోపాటు గనుల శాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ కూడా డిమాండ్ చేసినట్లు తెలిపింది.
దరఖాస్తులను పరిశీలించడానికి రూ. 80 లక్షలు అడిగినట్లుగా లీజు పోటీదారులు వాంగ్మూలం ఇచ్చారని పేర్కొంది. మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్‌ అలీఖాన్‌ల డిశ్ఛార్జి పిటిషన్‌లపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు విచారణ జరిపారు.

ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ తదితరులు గాలి జనార్దన్‌రెడ్డితో కుమ్మక్కయ్యారని, వేరేవారు లీజు కోసం ప్రయత్నిస్తే రూ.లక్షలు ఖర్చుపెట్టగలరా అని అడిగారన్నారని చెప్పారు. గాలికి లీజులు దక్కడంలో వీరు కీలక పాత్ర పోషించారని, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని, సింగపూర్‌, చైనా లకు ఖనిజాన్ని తరలించారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు వివరించారు. మాజీ ఐఏఎస్‌ కృపానందం ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, కేసు నమోదు చేసేనాటికే ఆయన పదవీ విరమణ చేశారనే విషయాన్ని గుర్తు చేశారు.

IAS Srilakshmi demanded Rs. 80 lakhs?

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ లీజుల వ్యవహారంపై సీబీఐ కోర్టులో ఇప్పటికీ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులు విచారణను జాప్యం చేయడానికి ఉద్దేశపూర్వకంగానే డిశ్చార్జి పిటిషన్లు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విచారణ పూర్తయి నిందితులకు శిక్షలు ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
The CBI has revealed that Y. Sreelakshmi, the then Secretary of the Industries Department in the United States, demanded that lakhs of rupees would be spent to get the mining leases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X