అందుకే పవన్ జత: బీజేపీపై టీడీపీ నేత ఘాటుగా..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు భారతీయ జనతా పార్టీల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పేరు చెబితేనే ఏపీ ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అటు రైల్వే బడ్జెట్, ఇటు సాధారణ బడ్జెట్‌లో కొత్తగా ఏర్పడిన ఏపీకి చేకూరిన మేలు ఏమీ లేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం అంటే ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1600 కోట్లు కావాలని అడిగితే కేవలం రూ.100 కోట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. అందువల్లే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి కేంద్రం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
మరో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఆదివారం నాడు బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏపీని ఇలాగే ట్రీట్ చేస్తే.. ప్రతి రాష్ట్రంలో కూడా ఢిల్లీలో ఎదురైన పరాభవం ఎదురవుతుందన్నారు.

ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి కొత్తూరు జంక్షన్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని అలిపిరి వద్ద టీడీపీ ఆందోళనలకు దిగింది. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం వల్ల రహదారిపై వాహన రాకపోకలకు అవాంతరం ఏర్పడడంతో బారీగా ట్రాఫీక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని శాంతింపజేయ ప్రయత్నించగా టీడీపీ నేతలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.












Click it and Unblock the Notifications