‘ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా’: ఫోన్లో ఓ టీడీపీ నేత బూతు పురాణం
కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ మైనారిటీ నేతపై తాజాగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి నోరు పారేసుకున్నారు. వాట్సప్ పోస్టింగ్ లపై ఆగ్రహంతో బూతు పురాణం విప్పారు.
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ మైనారిటీ నేతపై తాజాగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి నోరు పారేసుకున్నారు. వాట్సప్ పోస్టింగ్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతు పురాణం విప్పారు.
'నన్నెవరూ ఏం చేయలేరు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్యే ఉండాలి. తమాషా చేస్తున్నావా?' అంటూ ఫోన్ లో చిందులు తొక్కారు. అంతటితో ఊరుకోకుండా.. 'నేను అందరిలాంటి వాడ్ని అనుకోకు, నేనెంత మంచోడ్నో అంత ఇది..' అని హెచ్చరించారు.

ఇంకా.. 'నోరు తగ్గించుకుని మాట్లాడు. ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా. నేనంటే భయం లేదురా నీకు, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావురా.. చూపిస్తా చూడు..' అంటూ ఫోన్ లోనే ఏవీ సుబ్బారెడ్డి వీరంగం సృష్టించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోన్ కాల్ ఆడియో హాట్ హాట్ గా మారింది.












Click it and Unblock the Notifications