టీలో ఫస్ట్ రూ.600 కోట్లు, మెట్రో మార్గంలో.. (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఐకియా (ఐకేఈఏ) రూ.600 కోట్లతో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వ్యాపార కేంద్రాల పైన రాష్ట్ర ప్రభుత్వంతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో రెండు లేదా మూడు చోట్ల ఈ సంస్థ తమ సముదాయాలను ఏర్పాటు చేయనుంది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఐకియా సీఈవో జువెనికో మాటులు ఎంవోయుపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ రావు, ఐకియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆర్కియాలజీ అధికారులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును బుధవారం మధ్యాహ్నం ఆర్కియాలజీ అధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు.

ఆర్కియాలజీ అధికారులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును బుధవారం మధ్యాహ్నం ఆర్కియాలజీ అధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు.

ఐకియా
స్వీడన్‌కు చెందిన ఐకియా ఫర్నీచర్, జౌళీ ఉత్పత్తులు, ఇతర గృహోపకరణాల ఉత్పత్తిలో పేరొందిన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ వ్యాపారసముదాయాలను నిర్వహిస్తోంది. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి పొందిన ప్రముఖ సంస్థల్లో ఐకియా ఒకటి. శంలో తమ తొలి వ్యాపార సముదాయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఐకియా సంస్థ ఉత్పత్తులు బహుళ ఆదరణ పొందుతున్నాయని, ఇటీవల తాను సింగపూర్ పర్యటనలో ఐకియా సముదాయాన్ని చూశానని, అది తనను ఆకట్టుకున్నదని తెలిపారు.

ఐకియా
హైదరాబాదు ముత్యాలు, నిర్మల్, సిల్వర్ ఫిలిగ్రి, పెంబర్తిల్లోను హస్తకళ ఉత్పత్తులు, ఫర్నీచర్, జౌళి ఉత్పత్తులను ఐకియా సేకరించాలని కేసీఆర్ కోరారు. ఆ సంస్థకు సహకరిస్తామన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ విధానాలు తమను ఆకట్టుకున్నందునే దేశంలోనే తొలి సముదాయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని ఐకియా సీఈవో చెప్పారు. తమకు పరిశ్రమ హోదా కల్పించాలని కోరారు. మెట్రో రైలు మార్గంలో తమకు భూమిని ఇవ్వాలన్నారురు. మియాపూర్ వద్ద మెట్రో రైలు మార్గానికి సమీపంలో ఉన్న స్థలం కేటాయింపుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

శాంసంగ్ డేటా సిస్టమ్స్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును బుధవారం శాంసంగ్ డేటా సిస్టమ్స్ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు.

Click it and Unblock the Notifications