ఏపీలో భారీ వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు నిర్దేశిత సమయం కంటే ముందుగానే ప్రవేశిస్తున్నాయి. ఈ నెల 19న రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక,రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల పై వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది.

రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. బలమైన ఈదురు గాలులు(గంటకు 40-50 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా వచ్చే రెండు రోజల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది.

IMD Alerts heavy rains in next three days in Coastal and Seema Districts in AP

దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందిని తెలిపింది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా గోదావరి,కోస్తా, సీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎండలు క్రమేణా తగ్గముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+