దూసుకొస్తున్న భారీ తుఫాన్ - ఏపీకి బిగ్ అలర్ట్, స్కూళ్లకు సెలవు..!!

మరో తుఫాను దూసుకొస్తోంది. ఏపీ పైన ప్రభావం కనిపిస్తోంది. ఈ నెల 30 తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్ర పైన తుఫాను ప్రభావం ఉంటుంది. దీంతో, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఫెంగల్ తుఫాను ఏపీలోని కోస్తా జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారనుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది. దీంతో, ఐఎండీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు నుండి వచ్చే నెల ఒకటో తేదీ వరకు మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లిడించింది. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల పైన తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొంది.
మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళవద్దని హెచ్చరించింది.

IMD forecast light to moderate and heavy to very heavy rainfall at isolated places in AP till November 30

ప్రస్తుతం వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు గుర్తించారు. వాయు గుండం తుఫానుగా మారుతుంటంతో ఏపీలోని పలు జిల్లాల పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో నవంబర్ 27 నుంచి 29 వరకు చెన్నైలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 27 నుంచి 30 వరకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుతో సహా పలు జిల్లాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

తుఫాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సీఎం స్టాలిన్ అధికారులకు నిర్దేశించారు. భారీ వర్షాలతో
చెన్నై, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్‌తో సహా 9 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కోస్తా తమిళనాడులో నవంబర్ 28న కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+