మరో తుఫాను ముప్పు - హై అలెర్ట్, తాజా హెచ్చరిక..!!
ఏపీకి మరో తుఫాను పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జన జీవనం అస్తవ్యస్తం అయింది. ప్రాణ నష్టం సంభవించింది. ఇంకా ఈ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖ వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, మరోసారి ఆందోళన మొదలైంది.
తాజా హెచ్చరిక
భారీ వర్షాల నుంచి తేరుకోకముందే మరో హెచ్చరిక జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. విజయవాడ, గుంటూరు నగరం పైన పెను ప్రభావం చూపాయి. ఇంకా వర్షం ముప్పు తొలగలేదనే హెచ్చరికలు ఉన్నాయి. ఈ వర్షాలతో సాధారణ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

కోలుకోకముందే
వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బ తిన్నాయి. జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తోంది. పలు రైళ్లు రద్దు చేసారు. మరి కొన్ని దారి మళ్లించారు. రైళ్లు, బస్సులు లేక వేరే ప్రాంతాల్లో అనేక మంది ఇరుక్కుపోయారు అనేక మంది. ఇలాంటి సమయంలో ఈ నెల 6,7 తేదీల్లో... మరో వైపు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
అప్రమత్తం
అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. అయితే, ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోవటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. రైళ్ల పునరుద్దరణ పైన రేపు అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించే సమాచారం ఏంటనేది టెన్షన్ పెంచుతోంది.












Click it and Unblock the Notifications