ఉపరితల ఆవర్తనం: ఈ జిల్లాలకు భారీ వర్షాల పై తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండో వేసవి తరహాలో ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది .పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. ఈ మేరకు తాజా అలర్ట్స్ జారీ చేసింది.

తెలుగు రాష్టాల్లో వర్షాల పై వాతావరణ శాఖ తాజా సమాచారం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడతాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడతాయని చెప్పింది. కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

 తిరుమలలో ఇకపై ప్రతీ మంగళవారం- TTD కీలక నిర్ణయం, భక్తుల ఫిర్యాదుతో..!!
తిరుమలలో ఇకపై ప్రతీ మంగళవారం- TTD కీలక నిర్ణయం, భక్తుల ఫిర్యాదుతో..!!
imd-predicts-rains-in-many-areas-of-telugu-states-for-next-two-days-as-low-depression-in-bay-of-ben

వాతావరణ శాఖ తాజా అంచనాలు

దీంతో, మూడు రోజుల పాటు ఏపీలో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములతో కూడి వానలు పడతాయని, మెరుపులు కూడా సంభవిస్తాయని చెప్పింది. అయితే వాతావరణం చల్లబడి ఉంటుందని, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అదే విధంగా తెలంగాణలో నేడు వానలు అక్కడకక్కడ పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల తేలిక పాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో వర్షం పడింది. అదే విధంగా సాయంత్రం వేళ వాన పడే అవకాశముందని, అదేసమయంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+