రుతుపవనాలు వచ్చినా, అనూహ్య మార్పులు - తాజా అప్ డేట్..!!

రుతుపవనాలు వచ్చేశాయ్. కానీ ఎండల తీవ్రత తగ్గలేదు. వర్షాలు మొదలు కాలేదు. భారీ ఉష్ణోగ్రతలతో పలు ప్రాంతాలు మాడిపోతున్నాయి. అరేబియా సముంద్రంలో ఉన్న తీవ్ర తుఫాను బిపోర్జాయ్ వలన నైరుతి రుతువపనాలు బలంగా ముందుకు కదలటం లేదు. వచ్చే నెల 6వ తేదీ వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయి.

బలహీనంగా రుతుపవనాలు:
రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదిలేందుకు తీవ్ర తుఫాను అడ్డుగా నిలిచిందని వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రుతుపవనాలు ఈ నెల 21వ తేదీ లోపు మద్యభారతంలో ప్రవేశించే అవకాశాలు లేవని చెబుతున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగనుంది. వ్యవసాయ రంగం పైన వర్షాభావ పరిస్థితులు ప్రభావం చూపిస్తాయని అంచనా వేస్తోంది. బిపర్జోయ్ తుఫాను ఈ నెల 18వ తేదీకి గానీ పూర్తిగా బలహీపడే అవకాశం లేదు. అప్పటి వరకు రుతుపవనాలు పుంజుకొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ తుఫాను పూర్తిగా బలహీన పడిన తరువాత రుతుపవనాలు పుంజుకుంటాయని, అదే సమయంలో బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

IMD says Cyclone Biparjoy is now completely detached from the monsoonal flow, HEat Waves for next four days in AP

వడగాల్పులు..ఉష్ణోగ్రతలు:రుతుపవనాల రాక ఆలస్యంతో ఏపీ, తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఇదే సమయంలో ఐఎండీ వాదన మరో విధంగా ఉంది. రుతుపవనాల విస్తరణ పై బిపోర్జాయ్ తుఫాను ప్రభావం ఉండదని చెబుతోంది. దక్షిణా భారతంలో రుతుపవనాల విస్తరణకు బిపోర్జాయ్ తుఫాను దోహదపడిందని చెప్పుకొచ్చారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.

పాఠశాలలు ప్రారంభించినా హాజరు తక్కువగానే ఉంది. ఏపీలో ఒంటి పూట బడులు అమలు చేస్తున్నారు. వారం రోజులు సెలవులు పొడిగించాలని పేరెంట్స్ కమిటీ ప్రభుతాన్ని కోరింది. మంగళవారం ఎండలు, వడగాల్పుల తీవ్రత పలు ప్రాంతాల్లో కొనసాగింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో రుతుపవనాలు విస్తరించినా వర్షాలు కురవలేదు. దీనికి తోడు పడమర నుంచి పొడిగాలులు వీస్తుండటంతో అనేక ప్రాంతాలు నిప్పుల కుంపటి లా మారాయి. పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరో నాలుగు రోజులు ఇలాగే:తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో 45, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44.9, కాకినాడ జిల్లా సీతంపేటలో 44.7, పల్నాడు జిల్లా రావిపాడులో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం 188 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 195 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ విపత్తుల శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులువడగాల్పులు ప్రభావం చూపుతాయని పేర్కొంది.

అనేక మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+