వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించివుంది. దీనివల్ల రాష్ట్రంపైకి ఆగ్నేయ దిశగా, ఈశాన్య దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో రెండు మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు రోజులు కోస్తా, రాయలసీమలో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని వెల్లడించారు.
ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కోస్తాలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దీనిపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీచేసింది. గడిచిన 24 గంటల్లో 66 మండలాల్లో తీవ్ర వడగాలు వీయగా, 84 మండలాల్లో సాధారణ వడగాలులు వీచాయి.

భారత వాతావరణ శాఖ రైల్వేను అప్రమత్తం చేసింది. రైలు ప్రయాణికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వారికి తాగునీరు అందుబాటులో ఉండటంతోపాటు చల్లటి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వైద్య బృందాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ప్రయాణికులకు తగినంత నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు తీసుకువెళ్లాలని, దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్ ఫామ్ లపై, బోగీల్లో ప్రయాణికులకు మంచినీరు అందుబాటులో ఉంచనున్నారు. ప్లాట్‌ఫామ్‌లపై చల్లదనం కోసం కూల్ రూఫ్‌లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో45.1, విజయనగరం జిల్లా జామిలో 44.9, వైయస్‌ఆర్ జిల్లా ఖాజీపేటలో44.6, కర్నూలు జిల్లా వగరూరులో44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications