Amaravati : అమరావతిపై హైకోర్టులో మరో ట్విస్ట్? జగన్ సర్కార్ ముందు కీలక ప్రశ్న..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతిలో నిర్మాణాలు నిలిచిపోగా.. ఆ తర్వాత పేదలకు ఇళ్ల స్ధలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సదరు భూముల్ని వాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు పేదల ఇళ్ల స్ధలాల కోసం కేటాయించిన స్ధలాల్లో ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న వేళ హైకోర్టు కీలక ప్రశ్న వేసింది.

అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్ధలాల కేటాయింపు కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని సవాల్ చేస్తూ గతంలో రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టుల్ని ఆశ్రయించారు. అయితే అమరావతిపై తుది తీర్పుకు లోబడి ఈ స్ధలాలు కేటాయించేందుకు కోర్టులు అంగీకిరంచాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా ఇళ్ల స్ధలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రాన్ని అనుమతి కోరడం, మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఇళ్ల నిర్మాణం కోసం సుప్రీంకోర్టు అనుమతి ఉందా అని హైకోర్టు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

in big twist, hc ask jagan regime whether it has sc permission for amaravati houses construction

అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్ధలాల కేటాయింపుకు తాత్కాలిక అనుమతి ఇచ్చిన కోర్టులు.. ఇళ్ల నిర్మాణానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. కానీ కేంద్రం ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి నిధులిచ్చేందుకు వైసీపీ సర్కార్ అడుగులేస్తోంది. ఈ తరుణంలో ఇళ్ల నిర్మాణాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్న వేసింది. దీనిపై న్యాయవాదుల వద్ద సమాధానం లేదు. ప్రభుత్వం వివరణ తీసుకుని సమర్పిస్తామని మాత్రం తెలిపారు. దీంతో విచారణ 11వ తేదీకి వాయిదా పడింది.

అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు నేరుగా అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిపై హైకోర్టుకు ఇచ్చే వివరణ కీలకంగా మారింది. కేంద్రం ఇచ్చిన అనుమతిని ఆధారంగా చూపుతూ హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ సమర్పిస్తే అప్పుడు న్యాయస్ధానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఈ నెల 11న జరిగే విచారణలో ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+