నిద్రమత్తులో ఆలయాన్ని ఢీకొట్టారు .. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ... విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న లారీ మార్గంమధ్యలో మార్చి 9 శనివారం తెల్లవారుజామున అద్దంకి మండలం వెంకటాపురం గ్రామం వద్ద ఒంగోలు-విజయవాడ నేషనల్ హైవే పక్కన గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు లారీ​ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికుల సాయంతో బయటకు తీశారు.

In the sleeping they collided the temple .. died on the spot

నిద్ర మత్తు కారణంగా మితిమీరిన వేగంతో ఆలయాన్ని ఢీకొట్టటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. లారీ బీహార్‌కు చెందినదిగా భావించిన పోలీసులు, మృతుల వివరాలు తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+