ఒక్క మిథున్ రెడ్డికి మోదీ బిగ్ ఆఫర్- బెయిల్ పై ఉన్నా గానీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిథ్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు చోటు దక్కింది. త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు. తెలుగుదేశం- జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని కేంద్ర ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
మొత్తం 16 మంది ఎంపీలు ఉన్న ప్రతినిధుల బృందం ఇది. దీనికి బీజేపీ ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వాన్ని వహిస్తోన్నారు. అక్టోబర్ 27న న్యూయార్క్‌లో ప్రారంభమయ్యే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 80వ సెషన్‌కు భారత్ తరఫున ఈ ఎంపీల బృందం ప్రాతినిథ్యాన్ని వహించనుంది.

పురంధేశ్వరి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు విష్ణుదత్ శర్మ- ఖజురహో (మధ్యప్రదేశ్- బీజేపీ), డాక్టర్ భోళా సింగ్- బులంద్ షెహర్ (ఉత్తరప్రదేశ్- బీజేపీ), దిలీప్ సైకియా- దర్రాంగ్ ఉదల్ గురి (అస్సాం- బీజేపీ), సౌమిత్రా ఖాన్- బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్- బీజేపీ), రేఖా శర్మ- హర్యానా (రాజ్యసభ- బీజేపీ), సజ్దా అహ్మద్- ఉలూబేరియా (పశ్చిమ బెంగాల్- తృణమూల్ కాంగ్రెస్), పీ విల్సన్- తమిళనాడు (రాజ్యసభ- డీఎంకే) ఉన్నారు.
డాక్టర్ ఇంద్రా హంగ్ సుబ్బా- సిక్కం (సిక్కిం క్రాంతికారి మోర్చా), జొయంత బాసుమతరి- కోక్రాఝర్ (అస్సాం- యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్), సందీప్ కుమార్ పాథక్- పంజాబ్ (రాజ్యసభ- ఆమ్ ఆద్మీ పార్టీ), నిరంజన్ బిషి- ఒడిశా (రాజ్యసభ- బిజూ జనతాదళ్), ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా- బీహార్ (రాజ్యసభ- రాష్ట్రీయ జనతాదళ్), జీకే వాసన్- తమిళనాడు (రాజ్యసభ- తమిళ మానిళ కాంగ్రెస్ మూపనార్), డాక్టర్ టీ సుమతి- చెన్నై సౌత్ (తమిళనాడు- డీఎంకే) చోటు దక్కింది.
ఈ టీమ్ ఈ నెల చివరివారంలో అమెరికాకు బయలుదేరి వెళ్లనుంది. ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి కార్యక్రమాలు, సైడ్‌లైన్ భేటీలు, దౌత్య చర్చల్లో పాల్గొంటుంది. బెయిల్ పై ఉన్నప్పటికీ- ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ ప్రతినిధి బృందంలో మిథున్ రెడ్డికి చోటు లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
I am deeply thankful to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for trusting me with the opportunity to lead the delegation of Indian Parliamentarians to the 80th Session of the United Nations General Assembly (UNGA) in New York, beginning October 27.
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) October 6, 2025
The UNGA is a vital… pic.twitter.com/ubWSuUbzng
కాగా.. ఈ పార్లమెంటేరియన్ల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు పురంధేశ్వరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, భద్రత నుండి మానవ హక్కులు, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై చర్చించడానికి ఈ సర్వసభ్య సమావేశాలను ఓ ముఖ్యమైన వేదికగా అభివర్ణించారు. ఈ సదస్సులో పాల్గొనే సమయం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications