రైలు ఎక్కుతుంటే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి

రైలుబండి ఎక్కకపోతే ఓ గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటిన తర్వాత, వీటిలో ఏది ముందు అయితే దాని ప్రకారం రిజర్వేషన్ చేయించుకున్న బెర్త్ లను టీటీఈ ఇతరులకు కేటాయిస్తారు.

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కొత్త గైడ్ లైన్స్ ప్రకటించింది. రైళ్లలో ప్రయాణించేవారంతా వీటిని పాటించకపోతే చిక్కులు ఎదుర్కోక తప్పదు. తరుచుగా రైలు ప్రయాణం చేసేవారు.. లేదంటే లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకునేవారు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటమే ఈ నిబంధనల ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి 10.00 గంటల తర్వాత ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ ప్రయాణికుల రైలు టికెట్లను తనిఖీ చేయకూడదు. రాత్రి 10.00 గంటల తర్వాత రైలు ఎక్కినవారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. టీటీఈ వీరి టికెట్లను చెక్ చేయవచ్చు. మిడిల్ బెర్త్ ప్రయాణికులు రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు ఆ బెర్త్ ను ఉపయోగించుకోవచ్చు.

ఎవరైనా ప్రయాణికులు వారి ట్రైన్ మిస్ అయితే వారి సీట్లను లేదా బెర్త్‌లను టీటీఈ ఇతరులకు కేటాయిస్తారు. అయితే సదరు ప్రయాణికులు వారి స్టేషన్‌లో రైలుబండి ఎక్కకపోతే ఓ గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటిన తర్వాత, వీటిలో ఏది ముందు అయితే దాని ప్రకారం ఈ బెర్త్ లను టీటీఈ ఇతరులకు కేటాయిస్తారు. ప్రయాణికులకు బెర్త్ లో కలుగుతున్న ఇబ్బందుల్ని తొలగించేందుకు మరిన్ని నిబంధనలను రైల్వే రూపొందించింది.

indian railways new rules and regulations for passengers

బెర్త్ లో కానీ, కోచ్ లోకానీ ప్రయాణికులెవరూ ఫోన్ లో పెద్దగా మాట్లాడకూడదు. ఎక్కువ ధ్వనితో పాటలు వినకూడదు. వృద్ధల సౌలభ్యం కోసం, ఇతర ప్రయాణికుల కోసం ఈ నిబంధనలను రైల్వే అమలు చేస్తోంది. పాటలు పడుతున్నారని, బగ్గరగా మాట్లాడుతున్నారంటూ రైల్వేకు ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో దానిపై దృష్టిసారించి ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు రాత్రి 10.00 గంటల తర్వాత లైట్లను ఆన్ చేసి ఇతర ప్రయాణికుల నిద్రకు ఆటంకం కలిగిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రయాణికులు పాటించాల్సిన కొత్త రూల్స్ ను రైల్వే రూపొందించింది. వీటిని పాటించకపోతే చిక్కులు తప్పవు.

indian railways new rules and regulations for passengers

భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నిస్తోంది. కరోనాతో లాక్ డౌన్ ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల సమయాన్ని తనిఖీ చేసి వాటిని సమయం ప్రకారం క్రమపద్ధతిలో నడిపిస్తున్నారు. మరికొన్ని రైళ్లవి సమయవేళలు మార్చారు. దీనివల్ల మెరుగైన సౌకర్యం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దేశవ్యాప్తంగా సొంత తయారీలో వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+