గన్నవరం టు ముంబాయి, ఢిల్లీకి కొత్త సర్వీసులు - షెడ్యూల్..!!
గన్నవరం నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. దేశ ఆర్దిక రాజధాని ముంబాయికి రెగ్యులర్ ఫ్లైట్ ను ఇండిగో సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు ప్రతీ రోజూ సాయంత్రం 6.30గంటలకు ముంబై లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు ముంబైకి చేరేలా షెడ్యూల్ ఖరారు చేసారు. అదే విధంగా సెప్టెంబర్ 14 నుంచి న్యూఢిల్లీ నుంచి న్యూ ఢిల్లీ నుంచి గన్నవరం కు ఇండిగో కొత్త సర్వీసును ప్రారంభించనుంది.
గన్నవర్ - ముంబై సర్వీసు వలన ముంబై తో పాటుగా గల్ఫ్, యూరప్, ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణీకులకు సులువుగా కనెక్టివిటీ సదుపాయ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ముంబై- విజయవాడ మధ్య ఏయిర్ ఇండియా సర్వీసు నడుస్తుండగా, ఇప్పుడు ఇండిగో రాకతో మరో సర్వీసు అందుబాటులోకి వచ్చినట్లైంది. సెప్టెంబర్ 14 నుంచి దేశ రాజధాని న్యూ ఢిల్లీ నుంచి విజయవాడకు నూతన సర్వీసు ఇండిగో ప్రారంభిస్తోంది.

సుమారు 180 మంది ప్రయాణీకుల సామర్ధ్యం గల ఏయిర్ బస్ ఏ320 విమానం రోజు ఉదయం 8.10 గంటలకు న్యూ ఢిల్లీలో బయల్దేరి 10.40కి విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 11.10 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి మధ్నాహ్నం 1.40కి న్యూ ఢిల్లీ చేరుకోనుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఏయిరిండియా రెండు విమాన సర్వీసులు నడుపుతోంది. అయితే, ప్రయాణీకుల రద్దీని పరిగణలోకి తీసుకొని ఇండిగో సంస్థ ఢిల్లీ - గన్నవరం మధ్య సర్వీసు నడిపేందుకు ముందుకు వచ్చింది. ఈ రెండు విమానాలతో గన్నవరం నుంచి ఏయిర్ ట్రాఫిక్ మరింత పెరగనుంది.












Click it and Unblock the Notifications