ఆ స్టార్ హీరోయిన్ కారణంగా కన్నీరు పెట్టుకున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధా మూర్తి!!
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుధా మూర్తి పేరు తెలియని భారతీయులు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చాలా సాధారణంగా ఉండే ఈ విద్యావేత్త, అంతకు మించిన మానవతా మూర్తి అయిన సుధా మూర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వల్ల తాను కన్నీరు పెట్టుకున్నానని ఆమె చెప్పారు.
సహజంగా ఎటువంటి భావోద్వేగ భరితమైన సన్నివేశాలను చూసినా తాను ఏ రోజు కంటతడి పెట్టలేదని, కానీ అలియా భట్ వల్ల తాను కన్నీరు పెట్టుకున్నానని సుధా మూర్తి చెప్పారు. 2018 సంవత్సరంలో అలియా భట్ నటించిన స్పై థ్రిల్లర్ మూవీ రాజి చిత్రం చూసి తాను కంటతడి పెట్టుకున్నానని, అలియా నటనకు ఏడ్చేశానని సుధా మూర్తి చెప్పారు.

తన మొదటి సినిమాను 1958లో థియేటర్లో చూసానని, అప్పటినుంచి తాను వైజయంతిమాలను అభిమానించడం ప్రారంభించానని చెప్పారు. ఇక బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోల గురించి చెప్పుకొచ్చిన సుధా మూర్తి రాజేష్ ఖన్నా, దిలీప్ కుమార్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి హీరోల చిత్రాలను వివిధదశల్లో ఆస్వాదించానని, ఆయుష్మాన్ ఖురానా, నర్గీస్ వంటి గొప్ప నటీనటులను చూసానని, వారి నటనను తాను ఇష్టపడతానని చెప్పారు.
ఇక ఈ తరం నటులలో తాను అలియా భట్ నటనను అభిమానిస్తాను అంటూ సుధా మూర్తి పేర్కొన్నారు. నిజంగా అలియా భట్ ఒక గొప్ప యాక్టర్ అంటూ సుధా మూర్తి కితాబిచ్చారు. తమ ఇంట్లో సినిమాల గురించి కూడా చర్చించుకుంటాం అంటూ ఆమె పేర్కొన్నారు. సినిమాలకు సంబంధించిన సంగీతం, ఎడిటింగ్ తదితర అంశాలపై ఇంట్లో చర్చ సాగుతుందని సుధా మూర్తి తెలిపారు.
మొత్తంగా నారాయణమూర్తిని మెప్పించిన అలియాభట్ నటించిన రాజి సినిమా 2018లో విడుదలైన సినిమాలలో సెన్సేషన్ గా నిలిచింది. ఏకంగా 190 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. 64 ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా అలియాభట్ ఈ సినిమాకు అవార్డును కూడా అందుకుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications