పడుపు వృత్తి చేయమన్నాడని..: చనిపోయింది
విజయనగరం : భర్త నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయి విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాలీల పార్వతి (25) ఆదివారం రాత్రి మరణించింది. భర్త వేధింపులు తట్టుకోలేక, పడువు వృత్తి చేసి డబ్బులు సంపాదించమన్నాడనే అవమానాన్ని తట్టుకోలేక అతన్ని బెదిరించేందుకు ఆదివారంనాడు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుంది.
అయితే, ఒంటిపై కిరోసిన్ పోసుకున్న పార్వతికి భర్త నిప్పంటించాడు. నాలుగేళ్లుగా సాలీల శివ తన భార్య పార్వతిని వేధిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ప్రతి రోజూ ఆమెను కొడుతుండేవాడు. దాంతో ఆమె ఆ బాధలు భరించలేక తన పుట్టింటివారు ఉన్న జియ్యమ్మవలస మండలం గెడ్డ తీరువాడకు గతంలో వెళ్లిపోయింది. తర్వాత పెద్దలు సంధి చేసి ఒక్కటి చేశారు.

ఇద్దరూ కొద్ది రోజులుగా బాగానే ఉన్నారు. అయితే, ఆ తర్వాత భర్త శివ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆదివారం పథకం ప్రకారం పిల్లలను బయటకు పంపించి భార్యను వేధించడం ప్రారంభించాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తను బెదిరించేందుకు పార్వతి ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. వెంటనే శివ ఆమెకు నిప్పంటించాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.
అయితే, పార్వతి గట్టిగా కేకలు వేయకుండా ఆమె ఆడపడుచు సోమేశ్వరి ఆమె నోటిలో గుడ్డలు కుక్కి ఆమెకు కారణమైందని పోలీసులు అంటున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి మృతి చెందడం, తండ్రి పాలు కానుండడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.












Click it and Unblock the Notifications