సంక్రాంతి వేడుకలకు సిద్ధమా.. కోడి పుంజుల్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా ???

తెలుగు వారి అతిపెద్ద పండుగలలో "సంక్రాంతి" అగ్రస్థానంలో ఉంటుంది. దీనిని 'పెద్ద పండుగ' అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ పండుగను మూడు నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రైతులు పండించిన పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి, ఇది కేవలం మతపరమైన పండుగే కాకుండా ప్రకృతికి కృతజ్ఞత తెలిపే "రైతు పండుగ"గా కూడా పిలుస్తారు. అందుకే ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా.. సంక్రాంతి సమయానికి సొంతూళ్లకు చేరుకుంటారు.

కాగా సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది.. కొత్త బట్టలు, పిండివంటలు, గాలిపటాలు, ముగ్గులు, ఘాటైన ఘుమఘుమలతో వంటకాలు. అలానే ఈ పండుగ అనగానే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో (గోదావరి, కృష్ణా, గుంటూరు) గుర్తొచ్చేది కోడి పందాలు. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక ప్రాంతీయ సంప్రదాయంగా, ప్రతిష్టాత్మక వ్యవహారంగా మారిపోయింది. కోడి పందెలు నిర్వహించడం చట్టరీత్యా నేరం అని తెలిసినా... కానీ ఏటా వాటి నిర్వహణ జరుగుతూనే ఉంటుంది.

interetng-details-about-sankranti-and-types-of-kodi-punju-in-cock-fight

ముఖ్యంగా గోదారోళ్లకు కోడి పందెం అంటే ఒక ఎమోషన్ లాగా అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కోడి పందేల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బరులు సిద్ధం చేసి.. అవి చూసేందుకు వచ్చేవారి కోసం సౌకర్యాలు కూడా అదే రేంజ్ లో ఏర్పాటు చేస్తారు. డీజేలు, డాన్స్ లు, ఫుడ్ స్టాళ్సు ఇలా.. ముందు నుంచే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటారు. అందుకే సంక్రాంతి సంబరమంతా ఏపీలోనే ఉంటుందని అంటుంటారు.

కోడి పందాలకు సంబంధించి కుక్కుట శాస్త్రం బాగా ఫాలో అవుతారని అందరికీ తెలిసిందే. పందెం కోళ్లు గురించి, దాని పెంపకం, వాటిలో ఉండే జాతులకు ఇందులో ఉంటుంది. అలానే పందెం ఎప్పుడు వేయాలి, ఏ కోడిని పందెం బరిలో పెట్టాలి.. అందుకోసం తగిన వారం, వర్జ్యం చూసి పందెం కడుతుంటారు. ఈ క్రమంలోనే కుక్కుటశాస్త్రం ప్రకారం కోడి పుంజుల్లో ఎన్ని రకాలు ఉంటాయో మీకోసం ప్రత్యేకంగా..

కోడి పుంజుల్లో రకాలు..

రంగుల ఆధారంగా కోడి పుంజు జాతులను కుక్కుట శాస్త్రంలో వివరించారు. అందులో..

కాకి కోడిపుంజు
కాకి జాతి కోడిపుంజుకు శరీరం మొత్తం నల్లని ఈకలు ఉంటాయి. రంగు గాఢంగా ఉండటం దీని ప్రధాన లక్షణం.

సేతు కోడిపుంజు
సేతు జాతి కోడిపుంజు పూర్తిగా తెల్లటి ఈకలతో ఉంటుంది. శరీరం అంతా ఒకే రంగులో కనిపిస్తుంది.

పర్ల కోడిపుంజు
పర్ల కోడిపుంజుకు మెడ భాగంలో నలుపు, తెలుపు రంగుల ఈకలు కలసి ఉంటాయి. మిగతా శరీరం సాధారణ రంగులో ఉంటుంది.

సవల కోడిపుంజు
సవల జాతి కోడిపుంజుకు మెడపై పూర్తిగా నల్లని ఈకలు ఉంటాయి. మెడ రంగు దీనికి ప్రత్యేక గుర్తింపు.

కొక్కిరాయి కోడిపుంజు
కొక్కిరాయి కోడిపుంజుకు శరీరం ఎక్కువగా నల్లగా ఉంటుంది. అయితే శరీరంపై రెండు లేదా మూడు రంగుల ఈకలు కనిపిస్తాయి.

డేగ కోడిపుంజు
డేగ జాతి కోడిపుంజుకు ఎర్రటి ఈకలు ఉంటాయి. ఈ రంగు దీన్ని మిగతా కోళ్ల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది.

నెమలి కోడిపుంజు
నెమలి కోడిపుంజుకు వీపు భాగంలో పసుపు రంగు ఈకలు ఉంటాయి. రంగుల కలయిక ఆకర్షణీయంగా ఉంటుంది.

కౌజు కోడిపుంజు
కౌజు జాతి కోడిపుంజుకు నలుపు, ఎరుపు, పసుపు రంగుల ఈకలు మిశ్రమంగా ఉంటాయి.

మైల కోడిపుంజు
మైల కోడిపుంజుకు ఎరుపు మరియు యాష్ కలర్‌లో ఈకలు ఉంటాయి. ఈ కలర్ కాంబినేషన్ దీని ప్రత్యేకత.

పూల కోడిపుంజు
పూల జాతి కోడిపుంజుకు శరీరంపై పూల మాదిరిగా వివిధ రంగుల ఈకలు ఉంటాయని చెబుతారు.

పింగళ కోడిపుంజు
పింగళ జాతి కోడిపుంజుకు రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. అక్కడక్కడా నలుపు, గోదుమ రంగు ఈకలు కనిపిస్తాయి.

నల్లబోర కోడిపుంజు
నల్లబోర కోడిపుంజుకు ముదురు నల్లటి ఈకలు ఉంటాయి. శరీరంపై రంగు చాలా గాఢంగా ఉంటుంది.

ఎర్రపొడ కోడిపుంజు
ఎర్రపొడ జాతి కోడిపుంజుకు ఎరుపు రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఈకలు పొడిగా మెరుస్తూ ఉంటాయి.

ముంగిస కోడిపుంజు
ముంగిస జాతి కోడిపుంజుకు జూలు రంగులో ఈకలు ఉంటాయి. రంగు ముంగిస జంతువు రంగును తలపిస్తుంది.

అబ్రాసు కోడిపుంజు
అబ్రాసు కోడిపుంజుకు లైట్ గోల్డెన్ కలర్‌లో ఈకలు ఉంటాయి. మెరిసే రంగు దీని ఆకర్షణ.

గేరువా కోడిపుంజు
గేరువా జాతి కోడిపుంజుకు తెలుపు, లేత ఎరుపు రంగుల ఈకలు మిశ్రమంగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+