ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్- హాల్ట్ స్టేషన్లు ఇవే
Amrit Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది.
అదే సమయంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న అమృత్ అమృత భారత్ రైళ్ల జాబితాను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అయిదు రూట్లల్లో ఈ కొత్త ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. తాజాగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. తన ఒడిశా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

ఒడిశాలోని బెర్హంపూర్ నుంచి గుజరాత్ లోని ఉధ్నా వరకు రాకపోకలు సాగించే వీక్లీ ఎక్స్ ప్రెస్ ఇది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మీదుగా ఈ రైలు ఉధ్నాకు చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 1,708 కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేస్తుంది. అక్టోబర్ 5వ తేదీన ఈ ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల కోసం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. కమర్షియల్ ఆపరేషన్స్ అప్పటినుండే ఆరంభమౌతాయి.
#WATCH | Jharsuguda, Odisha | Prime Minister Narendra Modi flags off the Amrit Bharat Express between Berhampur and Udhna (Surat), providing affordable and comfortable connectivity across states, supporting tourism, creating employment opportunities, and linking key economic… pic.twitter.com/qPdd85fESP
— ANI (@ANI) September 27, 2025
- అక్టోబర్ 5 నుండి ప్రతి ఆదివారం రాత్రి 11:45 నిమిషాలకు బెర్హంపూర్ నుంచి బయలుదేరే నంబర్ 19022 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రెండో రోజు ఉదయం 8:45 నిమిషాలకు ఉధ్నాకు చేరుకుంటుంది.
- అక్టోబర్ 6 నుంచి ప్రతి సోమవారం ఉదయం 7:10 నిమిషాలకు ఉధ్నా నుంచి బయలుదేరే నంబర్ 19021 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 1:55 నిమిషాలకు బెర్హంపూర్ కు చేరుకుంటుంది.
- పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగఢ, మునిగూడ, కేసింగ, టిట్లాగఢ్, కాంటాబంజీ, ఖరియార్ రోడ్, మహాసముంద్, రాయపూర్, దుర్గ్, గోండియా, నాగ్ పూర్, వార్ధా, బద్నేరా, అకోలా, మల్కాపూర్, భుసావల్, జల్గామ్, ధరంగావ్, ఆమల్నేర్, సింద్ ఖేడా, డొండైచ, నందూర్బార్, నవాపూర్, వ్యారా, బర్దోలి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
- అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 22 ఆధునిక ఎల్ హెచ్ బీ కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 11 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు, ఎనిమిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు సెకండ్ క్లాస్-కమ్-లగేజ్ వ్యాన్లు, ఓ ప్యాంట్రీ కార్ ఉన్నాయి.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications