కేరళ అందాల కోసం IRCTC టూర్ ప్యాకేజ్
అతి తక్కువ ఖర్చుతో కేరళ టూర్ వెళ్లాలనుకునేవారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్తగా ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. మే 9వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. టూర్ ముగిసిన తర్వాత తిరిగి అదే స్టేషన్లలో దింపుతారు. 5 రాత్రులు, 6 పగళ్లు ఉండే ఈ టూర్ కోసం మే 9 నుంచి వారానికోసారి సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది.
మే 9, 16, 23, 30... ఇలా జూన్ 27 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. శబరి ఎక్స్ ప్రెస్ లో థర్డ్ ఏసీ, స్లీపర్ లో ప్రయాణం ఉంటుంది. ప్రతిరోజు తిరిగే రైలే అయినప్పటికీ మంగళవారం మాత్రం పర్యాటకుల కోసం కేటాయించారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. తర్వాతరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకుళం స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి మున్నార్ వెళతారు.

హోటల్ లో బస ఉంటుంది. అక్కడి విశ్రాంతి తీసుకొని ఆ రాత్రికి మున్నార్ లో ఉండాలి. తర్వాతరోజు టిఫిన్ చేసిన తర్వాత ఎర్నాకుళం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్ వీక్షిస్తారు. ఆ రాత్రికి అదే హోటల్ లో బస ఉంటుంది. నాలుగోరోజు అలెప్పీ వెళతారు. ఆ రాత్రికి అలెప్పీలోనే బస ఉంటుంది. 5వ రోజు అలెప్పీ నుంచి ఎర్నాకుళం రైల్వేస్టేషన్ కు చేరుకొని తిరుగు ప్రయాణం చేయడంతో యాత్ర ముగుస్తుంది.
సింగిల్ షేరింగ్ రూ.32,230, డబుల్ షేరింగ్ అయితే రూ.18,740, త్రిబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.15,130, 5-11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు బెడ్ తో రూ.8730, బెడ్ లేకుండా అయితే రూ.6530 చెల్లించాలి. ప్యాకేజీని బట్టి ఏసీ వాహనం ఉంటుంది. కేరళలో మూడు రాత్రులు ఉండటానికి గదులు, టిఫిన్ ఉచితంగా ఇస్తారు. మధ్యాహ్న, రాత్రి భోజనం మాత్రం పర్యాటకులే చూసుకోవాలి. గైడ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. బోటింగ్, హార్స్ రైడింగ్ ప్యాకేజీలో ఉండవు. యాత్రకు 15 రోజుల ముందు టికెట్ రద్దుచేసుకుంటే రూ.250 వసూలు చేస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎటువంటి నగదును తిరిగివ్వరు.












Click it and Unblock the Notifications