జగన్ విమర్శలపై మంత్రులు, ఎమ్మెల్యేల ఫైర్..! ఘాటు కౌంటర్లు..!
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. జగన్ ది అవగాహనా రాహిత్యమని, బాధ్యతా రాహిత్యమని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఏమాత్రం అవగాహన లేకుండా జగన్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ సీఎం జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా అని జగన్ ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఐదేళ్లు కాలములో గుంతలు కూడా పూడ్చలేని జగన్... పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారన్నారు. దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకోసారి అందిస్తున్నామన్నామని, ఉచిత గ్యాస్ జగన్ కు, అతని కార్యకర్తలకు రాలేదని అందరికీ రాలేదని అనుకుంటే ఎలా అని నాదెండ్ల ప్రశ్నించారు. అలాగే ఖరీఫ్, రబీ సీజన్లో కూటమి ప్రభుత్వం 12857 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఇందులో 12000 కోట్ల రూపాయలను 24 గంటల్లో రైతు ఖాతాలో జమ చేశామన్నారు. దీనిపై గూగుల్, ఏఐ సమాచారం తీసుకొని జగన్ అవగాహన పెంచుకోవాలన్నారు.

జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు. వైసీపీ నేత ప్రసన్న కుమార్‌రెడ్డి తీరును ఎవ్వరూ హర్షించరన్నారు. ఒక్క జగన్ మాత్రమే సమర్థిస్తున్నారన్నారు. ప్రసన్న కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయన్నారు. ప్రసన్న కుమార్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి గురించి తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్‌దే అన్నారు. రౌడీషీటర్లను జగన్ పరామర్శిస్తున్నారనని, ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయలు తొక్కించారన్నారు. జగన్ తీరును ప్రజలు గమనించాలన్నారు. రప్పా రప్పా నరుకుతామని అనడం తప్పు కాదా అని ప్రశ్నించారు.
ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి పోకడలు, ఆలోచనలు చూసిన తరువాత, ఈ రోజు అతని ప్రెస్ మీట్ చూశాక రెండు విషయాల్లో అందరికీ పూర్తి క్లారిటీ వచ్చింది.
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) July 16, 2025
జగన్ రెడ్డికి 2024లో వచ్చిన ఓటమి ఇంకా అర్థం కాలేదు. ప్రజల తీర్పును అర్థం చేసుకోలేదు.
జగన్ మారలేదు. మారలేడు. 2029లో కూడా గెలవలేడు.
ఇక… pic.twitter.com/tDbr22gwV1
మరోవైపు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి పోకడలు, ఆలోచనలు చూసిన తరువాత, ఈ రోజు అతని ప్రెస్ మీట్ చూశాక రెండు విషయాల్లో అందరికీ పూర్తి క్లారిటీ వచ్చిందన్నారు. జగన్ రెడ్డికి 2024లో వచ్చిన ఓటమి ఇంకా అర్థం కాలేదని, ప్రజల తీర్పును అర్థం చేసుకోలేదని తెలిపారు.జగన్ మారలేదని, మారలేడని, 2029లో కూడా గెలవలేడని తేల్చేశారు. వైసీపీ నేతలు వేరే దారి చూసుకోవాలని, కార్యకర్తలు ఆశలు వదులుకోవాలని సూచించారు.
YCP అధినేత వై.ఎస్.జగన్ రెడ్డి విలేకరుల సమావేశం అంటే ప్రజాసమస్యలు ప్రస్తావిస్తారని, రాష్ట్రానికి మేలు చేసే సూచనలు చేస్తారని భావించా.
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) July 16, 2025
కానీ అబద్దాలతో కూడిన మాటలు ఆశ్చర్యం వేసింది.
ఆంధ్రప్రదేశ్ ఆటవిక రాజ్యంగా తయారైందని వై.ఎస్. జగన్ రెడ్డి గారు అన్నారు.
(Continued in Carousel) pic.twitter.com/uLBl0yaNfY
మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా జగన్ వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. ధనుంజయరెడ్డిని మచ్చలేని అధికారిగా జగన్ ప్రశంసించడం సిగ్గుచేటన్నారు. ధనుంజయరెడ్డిని వేధిస్తున్నారన్న జగన్ మాటలు వినడానికే కంపరంగా ఉందన్నారు. జగన్.. నీకు ధనుంజయరెడ్డిపై అంత ప్రేమ ఉంటే సీబీఐకి లేఖ రాయగలవా అని ప్రశ్నించారు. ధనుంజయరెడ్డి తప్పు చేయలేదు.. చేసి ఉంటే కేసు నమోదు చేయాలని కోరగలవా అని అడిగారు. సినిమా డైలాగులు వాడితే తప్పేంటని అమాయకంగా ప్రశ్నిస్తున్నావా జగన్ అన్నారు. బోసడికే అనేది మాత్రం సినిమా డైలాగ్ కాదంటావా అని అడిగారు.

రాష్ట్ర అభివృద్ధికి దుష్టశక్తిలా జగన్ అడ్డుపడుతున్నాడని మరో టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ప్రజలు 11 సీట్లు ఇస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా జగన్ కు చేతకావడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకున్నావ్... ఇప్పుడు కూడా పబ్జీ ఆడుకోవచ్చు కదా అన్నారు. పరామర్శల పేరుతో ఎందుకు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రపా రపా నరికితే మంచిదే కదా సినిమా డైలాగ్ వాడితే తప్పేంటని మాట్లాడారని, మరీ వివేకం సినిమా ఎందుకు కోర్టుకువెళ్లి అడ్డుకున్నావు, రిలీజ్ చేయవచ్చు కదా అన్నారు.












Click it and Unblock the Notifications