విభజనతో నిజాంకేం లింక్: అక్బర్, అందరికీ చెప్తా: బాబు

1952లో చైనాకు వ్యతిరేకంగా యుద్ధం జరిగినప్పుడు నిజాం రాజు 120 కిలోల బంగారం భారత ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. భగవద్గీతను తర్జూమా చేసేందుకు డబ్బులు ఇచ్చారన్నారు. హైదరాబాదును జవహర్ లాల్ నెహ్రూ మినీ ఇండియా అన్నారని గుర్తు చేశారు. నిజాం గుడ్ లీడర్, గుడ్ రూలర్ అన్నారు.
అంతా విప్పుతా: చంద్రబాబు
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు తాను అన్నింటి గురించి సవివరంగా మాట్లాడుతానని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెసు, మజ్లిస్, తెలంగాణ రాష్ట్ర సమితి.. అందరు అడిగిన వాటికి తాను సమాధానం చెబుతానని చెప్పారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు విషయంలో ఎవరేం చేశారో చెబుతానన్నారు. శైలజానాథ్, హరీశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీలు అడిగిన వాటికి సమాధానం చెబుతానన్నారు. చరిత్ర ఉందని, దానిని ఎవరు మార్చలేరన్నారు. తెలంగాణకు తాను ఏం చేశానో కూడా చెబుతానన్నారు. ఎన్టీఆర్ తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను నిర్మూలించారన్నారు.
సోనియా గాంధీని అనడంపై కిరణ్
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పయ్యావుల కేశవ్ ఇటాలియన్ గాంధీ అనడాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. 1992లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి వద్దన్న తర్వాతనే పివి నర్సింహ రావు ప్రధాని అయ్యారన్నారు. భారత్‌లో ఆమెకు పౌరసత్వం ఉందని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. సబ్జెక్టు పైననే మాట్లాడాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications