Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీజేకు జగన్‌ లేఖపై భారీ ట్విస్టులు-జవాబుదారీకే అఫిడవిట్‌ - రుజువు కాకుంటే చర్యలేనా ?

ఏపీలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారంటూ గతంలో సీఎం జగన్‌ ఛీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఛీఫ్ జస్టిస్‌ చర్యలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ గతంలో రాసిన ఫిర్యాదు లేఖను అఫిడవిట్‌ రూపంలో పంపాలని కోరినట్లు, దీంతో సీఎం జగన్ అదే ఫిర్యాదును జగన్ సంతకం చేసి పంపినట్లు సీఎంవో వర్గాలు జాతీయ మీడియా సంస్ధలకు ధృవీకరించాయి. అయితే ఈ అఫిడవిట్‌ కోరడం వెనుక కారణాలపై ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది.

 జగన్‌ లేఖపై సీజేఐ చర్యలు

జగన్‌ లేఖపై సీజేఐ చర్యలు

ఏపీలో తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు సుప్రీం జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారంటూ గతంలో సీఎం జగన్ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీనిపై ఆయన స్పందించి చర్యలు తీసుకుంటున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్‌ రాసిన ఫిర్యాదు లేఖలో అంశాల తీవ్రతను పరిశీలించిన తర్వాత దీన్ని అఫిడవిట్‌ రూపంలో పంపాలని సీఎం జగన్‌ను ఛీఫ్‌ జస్టిస్‌ కార్యాలయం కోరిందని పలు జాతీయ లీగల్ వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. గతంలో జగన్ పంపిన లేఖపై ఛీఫ్‌ జస్టిస్‌ కోరిన విధంగా అఫిడవిట్‌ కూడా పంపినట్లు అవి ఏపీ సీఎంవో వర్గాల స్పందన ఆధారంగా ధృవీకరించాయి.

 సీజే జగన్ అఫిడవిట్‌ కోరడంపై చర్చ

సీజే జగన్ అఫిడవిట్‌ కోరడంపై చర్చ

ఛీఫ్ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ఏపీ సీఎం జగన్‌ తనకు రాసిన లేఖను అఫిడవిట్‌ రూపంలో పంపాలని కోరడం వెనుక కారణాలపై ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం హోదాలో జగన్‌ పంపిన ఫిర్యాదుపై నేరుగా చర్యలు తీసుకోవడం, లేదా తిరస్కరించే అధికారం ఛీఫ్‌ జస్టిస్‌కు ఉంది. కానీ తొందరపడకుండా ముందుగా ఈ లేఖను ప్రమాణ పత్రం రూపంలో పంపాలని ఛీఫ్‌ జస్టిస్‌ ఎందుకు కోరారన్న దానిపై న్యాయనిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదును ప్రమాణం రూపంలో సమర్పించడం అంటే అందులో చేసిన ఆరోపణలను కట్టుబడి ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించడమేనని నిపుణులు చెప్తున్నారు.

 న్యాయవ్యవస్ధ ప్రతిష్టతో ముడిపడినందునే

న్యాయవ్యవస్ధ ప్రతిష్టతో ముడిపడినందునే

ఓ రాష్ట్రంలో కార్యనిర్వాహక వ్యవస్ధకు అధిపతిగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టులో కాబోయే ఛీఫ్‌ జస్టిస్‌గా ఉన్న సీనియర్‌ న్యాయమూర్తితో పాటు రాష్ట్ర హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌, ఇతర న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఇలాంటి తరుణంలో ఛీఫ్‌ జస్టిస్‌ తీసుకునే చర్యలు న్యాయవ్యవస్ధ ప్రతిష్టతో ముడిపడి ఉన్నందున వాటిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సీజే భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలా స్పందించాలన్న అంశంపై ఛీఫ్‌ జస్టిస్‌ ఇతర న్యాయమూర్తులతో సమాలోచనలు జరుపుతున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది. అందుకే సీఎం స్ధాయిలో జగన్ చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గకుండా అఫిడవిట్‌ కోరినట్లు న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

 రుజువు చేయలేకపోతే చర్యలేనా ?

రుజువు చేయలేకపోతే చర్యలేనా ?

వాస్తవానికి న్యాయస్ధానాల్లో దాఖలు చేసే అఫిడవిట్లను సదరు వ్యక్తులు లేదా సంస్ధలు, ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అందులో ఓసారి పేర్కొన్న అంశాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అందుకు విరుద్దంగా మరో అఫిడవిట్‌ వేయడం కానీ సవరణలు కోరడం కానీ ఉండదు. ఇప్పుడు ఛీఫ్ జస్టిస్‌కు జగన్‌ రాసిన లేఖ విషయంలోనూ ఓసారి అఫిడవిట్‌ దాఖలు చేయడం ద్వారా సీఎం జగన్ న్యాయమూర్తులపై తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు తద్వారా అవి నిరాధారం అని తేలితే తనపై చర్యలు తీసుకోవచ్చని ఛీఫ్‌ జస్టిస్‌కు చెప్పినట్లేననే వాదన వినిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+