వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం అయినా జగన్ సంతోషంగా లేరా? మంత్రి వ్యాఖ్యలు నిజమేనా!! ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసి సీఎం అయినా జగన్మోహన్ రెడ్డికి సంతోషం లేదా? రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? తమ హయాంలో సంక్షేమ పాలన అందిస్తామని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనుకున్నది చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారా? అంటే అవునని చెబుతున్నారు వైసీపీ మంత్రులు.

జగన్ ఇబ్బందులపై మంత్రి విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ ఇబ్బందులపై మంత్రి విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు


తాజాగా మంత్రి పినిపే విశ్వరూప్ విజయవాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లారీ యజమానులు పడుతున్న కష్టాలను విన్న మంత్రి పినిపే విశ్వరూప్, వారి సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెబుతూనే, ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు. సీత బాధ సీతది పీత బాధ పీతది అన్న చందంగా మీరే కాదు సీఎం జగన్ కూడా కష్టాలు పడుతున్నారు అన్నట్టు చెప్పుకొచ్చారు.

 కోవిడ్ తో ఆర్ధిక సంక్షోభం .. జగన్ సీఎం అయినా సంతోషంగా లేరు

కోవిడ్ తో ఆర్ధిక సంక్షోభం .. జగన్ సీఎం అయినా సంతోషంగా లేరు


రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోటు బడ్జెట్ వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పినిపే విశ్వరూప్ వెల్లడించారు . సీఎం అయినా జగన్ సంతోషంగా లేరని ఆయన పేర్కొన్నారు.

ఏపీ ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా .. జగన్ ఆందోళన

ఏపీ ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా .. జగన్ ఆందోళన


దీంతో మంత్రి పినిపే విశ్వరూప్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక పథకం పేరుతో ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇలా అర్థం పర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వివిధ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ప్రతిపక్ష పార్టీలు జగన్ పాలనా వైఫల్యాలపై మండిపడుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ చేస్తున్న అప్పులపై పరిమితులు విధించే పరిస్థితి వచ్చిందంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే జగన్ ఆందోళనకు కారణం అని భావిస్తున్నారు.

మంత్రి వ్యాఖ్యల్లో నిజముందన్న చర్చ

మంత్రి వ్యాఖ్యల్లో నిజముందన్న చర్చ


రాష్ట్ర వ్యాప్తంగా హామీల అమలు కోసం కావాల్సిన నగదు ప్రభుత్వ ఖజానాలో లేకపోవడం, అప్పుల కోసం నిత్యం ఆర్బీఐ చుట్టూ, ఆర్థిక సంస్థల చుట్టూ తిరగాల్సి రావడం సీఎం జగన్ కు తలనొప్పిగా తయారైందన్న చర్చ జరుగుతుంది. జగన్ సంతోషంగా లేరని మంత్రి పినిపే విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలలో నిజం ఉండే ఉంటుందన్న చర్చ తాజా పరిణామాల నేపథ్యంలో వ్యక్తమవుతుంది. ఏదిఏమైనా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన జగన్, తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటి అమలు కోసం నిర్ణయాలు తీసుకోవడమే తాజా పరిస్థితికి కారణమన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.

English summary
There will be an interesting discussion in the AP on the remarks made by Minister Pinipe Viswaroop that Jagan not happy as CM, CM facing problems with the economic situation in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X