చంద్రబాబు టార్గెట్ గా రాం గోపాల్ వర్మ ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఓ కామెడీ ట్రాక్ అన్న ఆర్జీవీ
Recommended Video
అసలే బాధలో ఉంటే, అసెంబ్లీలో వైసీపీ నేతలు చేస్తున్న మాటల దాడినే తట్టుకోలేకపోతుంటే మధ్యమధ్యలో చంద్రబాబు మీద సెటైర్లు వెయ్యటానికి వివాదాస్పద దర్శకుడు నేనున్నానంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ లు పెడతాడు . ఏపీలో తాజా పరిస్థితి , టీడీపీపై జరుగుతున్న దాడిని చూసి పార్టీ శ్రేణులు భయాందోళనకు గురవుతుంటే మధ్యలో రాం గోపాల్ వర్మ ట్వీట్లు , సెటైర్లు టీడీపీని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
బాబుని, టీడీపీని టార్గెట్ చేసిన రాం గోపాల్ వర్మ .. ట్విట్టర్ వేదికగా పోస్ట్ లు
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ చంద్రబాబు మీద మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడుతున్నారు. ఏపీ ఎన్నికల ముందే కాదు, ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బాబు టార్గెట్ గా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాలతో కాలం గడిపే రాంగోపాల్ వర్మ టీడీపీ అంటే, చంద్రబాబు అంటే ఒంటికాలిమీద లేస్తారనే విషయం జగమెరిగిన సత్యం . మొన్నటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని పట్టుకొని చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాన్ని తన ట్వీట్ లతో, తన వ్యాఖ్యలతో హింసించిన రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకున్నారు. వర్మ ఇక ఏపీ అసెంబ్లీ సెషన్స్ పైన కూడా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఏపీ అసెంబ్లీలో ఒక కామెడీ ట్రాక్ అనా అర్ధం .. జస్ట్ అడుగుతున్నా అంతే అంటూ షాకింగ్ ట్వీట్
గత అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏపీ అసెంబ్లీలో బాబు గారు బ్రహ్మానందం అయిపోయారంటూ సెటైర్లు వేశారు వర్మ . ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు బ్రహ్మానందంలా కామెడీ పండిస్తున్నారని వర్మ పేర్కొన్నారు. బాబు మాట్లాడినప్పుడల్లా జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. దీని అర్ధం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారు అని వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఇక ఇప్పుడు తాజాగా ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన ప్రతీసారి జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. నవ్వులతో మునిగిపోతున్నారు. నేను లాస్ట్ టైం చంద్రబాబు మాట్లాడినప్పుడు జగన్ రియాక్షన్ సినిమాలో బ్రహ్మానందం ను చూసినట్టుగా అనిపించింది. కనుక టీడీపీ ఏపీ అసెంబ్లీలో ఒక కామెడీ ట్రాక్ అనా అర్ధం .. జస్ట్ అడుగుతున్నా అంతే అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications