వర్క్ ఫ్రం హోం కు గుడ్ బై - ఆఫీసులకు రావాల్సిందే : ఐటీ కంపెనీల సందేశాలు..!!
కరోనా కారణంగా వర్క్ ఫ్రం అమలు చేస్తున్న ఉద్యోగులకు తాజాగా సందేశాలు వస్తున్నాయి. తాము పని చేస్తున్న సంస్థల నుంచి వస్తున్న ఆ సందేశాలు ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు వరుసగా అందుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా 'ఇంటి నుంచి పని' చేస్తున్న ఐటీ ఉద్యోగులు త్వరలోనే కార్యాలయాలకు రానున్నారు. ఏప్రిల్ 1 నుంచి కార్యాలయాల్లో పనిచేసేందుకు సన్నద్ధం కావాలని ఐటీ సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి సందేశాలు పంపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1400 ఐటీ సంస్థలు ..అందులో పని చేస్తున్న 6.30 లక్షల మంది ఉద్యోగులు ఇక కార్యాలయాల నుంచే పని చేసేందుకు సిద్దం అవుతున్నారు.

వర్క్ ఫ్రం హోం ద్వారా లక్షలాది మంది..
ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా భారీగా విస్తరించిన ఐటీ సంస్థల్లోనే లక్షలాది మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కరోనా ఆంక్షల కారణగా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్న వేళ..రెండేళ్ల కాలంగా వీరంతా కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వస్థలాల నుంచి విధులు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ తొలిగిపోయిందంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలన్నీ యధావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఫలితంగా ఐటీ సంస్థలు తిరిగి ఓపెన్ చేయటానికి సిద్దమయ్యాయి. ఐటీ ఉద్యోగులు దాదాపు 90 శాతం మంది వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీనివల్ల ఐటీ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాల ఉపాధిపై ప్రభావం పడింది. కార్యాలయాల్లో పనిని పునరుద్ధరిస్తే ఆ వర్గాల ఉపాధికి భరోసా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఐటీ సంస్థల తిరిగి ప్రారంభం
హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది నగరానికి దూరంగా సొంతూళ్లలో ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి, అద్దె ఇళ్లు వెతుక్కోవడం, వసతిగృహాల్లో చేరడానికి వీలుగా కంపెనీలు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాయి. అయితే, ఉద్యోగుల వెసులుబాటుతో పాటుగా.. ఒకే సారి అందరినీ కార్యాలయాలకు రప్పించకుండా.. దశల వారీగా అమలుకు నిర్ణయించారు. తొలుత వారానికి 2-3 రోజులు..ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా ప్రాజెక్టుల వారీగా రప్పించాలని కంపెనీలు నిర్ణయించాయి. ఒక ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా... గ్రూపులుగా విభజించనున్నాయి.

ఏప్రిల్ నుంచి దశల వారీగా
తొలుత వారానికి 2-3 రోజులు కార్యాలయాల్లో, మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్నాయి. సెకండ్ వేవ్ పూర్తయిన తరువాత కొంత శాతం మేర ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతున్నారు. దాదాపు పది శాతం వరకు ఉద్యోగులు కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాకు తీసుకొచ్చేందుకు..ముందుగానే సందేశాలు.. మెయిల్స్ ద్వారా సంసిద్దులను చేస్తున్నారు. అదే సమయంలో మరి కొంత కాలం కోవిడ్ నుంచి రక్షణకు పాటించాల్సిన చర్యలు సైతం అమలు చేస్తూనే...సంస్థలను నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి తిరిగి ఉద్యోగులతో ఐటీ సంస్థలు కళకళలాడనున్నాయి.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications